యవ్వనంలోకి రాగానే శృంగార కోర్కెలు మొదలవుతాయి. కొంతమంది యువతీ, యవకులు ఆ కోర్కెలతో సతమతమవుతూ ఉంటారు. అవి తట్టుకోలేని పరిస్థితిలో తప్పుడు పనులు కూడా చేస్తుంటారు. యువతులతో పోల్చుకుంటే యువకులలో కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది యువకులు రంకెలేస్తున్న కోర్కెలతో అల్లాడుతూ ఉంటారు. తమ కామ కోర్కెలు తీర్చుకోవటానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది యువకులు ప్రేమ పేరుతో యువతుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వీరికి కావాల్సింది కేవలం తమ కోర్కెలు తీర్చుకోవటమే. అందుకు ఎంతో నమ్మకంగా యువతుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తిపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. ఇద్దరి మధ్యా ప్రేమ మొదలైన తర్వాత తమ అసలు రూపాన్ని బయటపెడతారు.
శృంగారం కోసం ఒత్తిడి చేస్తారు. అమ్మాయి ఒప్పుకుంటే జీవితం నాశనం అయినట్లే.. తమ కోర్కెలు తీరగానే వాళ్లను వదలిపెట్టేస్తారు. తర్వాత ఆ అమ్మాయి ఎవరో అన్నట్లు ప్రవర్తిస్తారు. మరికొంతమందికి తమ ప్రియురాలిని వదలేయాలన్న ఆలోచన ఉండదు. కానీ, వారిని సెక్స్ కోసం తొందర చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో సెక్స్ కోర్కెలు అధికంగా ఉండటం వల్ల ప్రతి రోజూ సెక్స్ కోరుకుంటూ ఉంటారు. హద్దులు లేని వీరి కోర్కెలను తృప్తి పర్చటం ఎవ్వరి వల్లా కాదు. ప్రతి రోజు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా కొంతమందిలో కోర్కెలు అస్సలు ఉండవు. ఒకవేళ వీరి ప్రియురాళ్లు శృంగారం కోసం పరితపిస్తున్నా కూడా వీరు పట్టించుకోరు. తమకు ఏదీ పట్టనట్లు ఉంటారు.
ప్రియురాలు అడిగిన ప్రతీసారి దాన్ని దాట వేస్తూ ఉంటారు. ఆమె వైపునుంచి తొందర ఉంటుంది కానీ, అతడు మాత్రం ఏమాత్రం స్పందించడు. ఇలా ఒక్కో రకం యువకులతో ఒక్కో రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఏదైనా బంధంలోకి దిగే ముందు.. తర్వాతి పరిణామాల గురించి ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే.. మీరు బంధంలోకి దిగే వ్యక్తులు ఏమి ఆశించి ఆ బంధాన్ని కోరుకుంటున్నారో మీకు తెలియదు కదా.. అందుకే అమ్మాయిలు లౌక్యంతో వ్యవహరించాలి. తాము ఇబ్బంది పడకుండా.. ఎదుటి వ్యక్తని ఇబ్బంది పెట్టకుండా నడుచుకోవాలి. ఎదుటి వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అని నూటికి నూరు శాతం ధ్రువీకరించుకున్న తర్వాతే ముందుకు సాగాలి.