ఈ కాలంలో ఒక్క పెళ్లి – ఒక్క సంతానం అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఒకప్పుడు గంపెడు పిల్లలు కనాలని దీవించేవారు. కానీ ఇప్పుడు ఒక్కరు ముద్దు., ఇద్దరు వొద్దు అంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం సంతానం కనడానికి పరిమితి ఉండదు. మరికొన్ని దేశాల్లో వివాహాలకు కూడా పరిమితి ఉండదు. ఎంతమందిని అయినా పెళ్లి చేసుకునే అనుమతి ఉంటుంది. ఆఫ్రికా దేశం జింబాబ్వేలో ఓ వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే ఓరి నాయనో అంటారు. జింబాబ్వే మాజీ సైనికుడు మిషెక్ న్యాండోరో ఇప్పటివరకు 16 పెళ్లిళ్లు చేసుకుని, ఏకంగా 151 మంది సంతానాన్ని కన్నాడు. ప్రస్తుతం మిషెక్ వయసు 66 సంవత్సరాలు. తాజాగా ఈయన మరో వివాహానికి సిద్దం అవుతున్నారు.
16 మంది భార్యలు, 151 మంది పిల్లల అంటే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం.. అంతే కాదు ఈయన కుటుంబాన్ని ఎలా పోషిస్తుంటాడు అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. దీనికి మిషేక్ సమాధానం ఇస్తూ నా పెద్ద పిల్లలు డబ్బు సంపాదిస్తున్నారు. నేను హాయిగా జీవిస్తున్నాను. నా లక్ష్యం వెయ్యి మంది పిల్లలు కనడం. నేను చచ్చే లోపే ఆ ఘనకార్యం సాధిస్తా అంటున్నారు. త్వరలో 17వ పెళ్లి చేసుకోబోతున్న అన్నాడు. నేను ఇప్పటి వరకు చేసుకున్న అన్ని పెళ్లిళ్లు భార్యలకు చెప్పిన తర్వాతే చేసుకున్నాను. వారి అంగీకారంతోనే ఇన్ని పెళ్లిళ్లు జరిగాయి అని వివరించాడు. అతనికి అంతగా ‘సాయం’ చేస్తోన్న భార్యలకి అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.