"సికిందర్ రాజా" ఈ పేరు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి పరిచయం అవుతుంది. తన ఆల్ రౌండర్ ప్రతిభతో ఏకంగా ఐపీఎల్ లోనే చోటు సంపాదించాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన ఈ ఆల్ రౌండర్ బాగానే రాణించాడు. ఇక ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచుల్లో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో ఆల్ టైం రికార్డ్ ఒకటి నెలకొల్పాడు.
స్టార్ క్రికెటర్లంటే టాప్ టీమ్స్ గా కొనసాగే ప్లేయర్లే గుర్తుకొస్తారు. అయితే చిన్న జట్టే అయినా కొంతమంది ప్లేయర్స్ మాత్రం స్టార్ ప్లేయర్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఆడతారు. కానీ వీరికి మాత్రం తగినంత గుర్తింపు అయితే రావడం లేదు. దీంతో వీరు అండరేటెడ్ గా ప్లేయర్లుగా మిగిలిపోతున్నారు. పసికూన దేశాలంటే పెద్దగా పట్టించుకోని క్రికెట్ లవర్స్ కి వీరు సాధించిన రికార్డులే వీరిని అందరికీ తెలిసేలా చేస్తాయి. తాజాగా అలాంటి ప్లేయర్ ఒకరు ఇప్పుడు వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు జింబాబ్వే సంచలన ఆల్ రౌండర్ సికిందర్ రాజా.
“సికిందర్ రాజా” ఈ పేరు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి పరిచయం అవుతుంది. తన ఆల్ రౌండర్ ప్రతిభతో ఏకంగా ఐపీఎల్ లోనే చోటు సంపాదించాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన ఈ ఆల్ రౌండర్ బాగానే రాణించాడు. ఇక ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ నేపథ్యంలో క్వాలిఫయయింగ్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జింబాబ్వే, నెదర్ ల్యాండ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచులో జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది. నెదర్ లాండ్స్ విధించిన 316 పరుగుల లక్ష్యాన్ని 40.5 ఓవర్లలోనే ఛేజ్ షాక్ కి గురి చేసింది. ఆల్ రౌండర్ సికిందర్ రాజా 54 బంతుల్లోనే సెంచరీ చేసి వేగంగా మ్యాచ్ ని ముగుంచాడు.
స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టిన దూకుడు ఎక్కడ కూడా ఆగలేదు. రాజా ఇన్నింగ్స్ లో 6 బౌండరీలు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేయడమే కాకుండా.. అతి పెద్ద వయసులో సెంచరీతో పాటు 4 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఒకప్పుడు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ పేరు మీద ఉంది. రిచర్డ్స్ 35 ఏళ్ళ వయసులో 1987 లో న్యూజిలాండ్ మీద ఈ ఘనతను సాధించాడు. ఇక ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా జింబాబ్వేకి ఇది వరుసగా రెండో విజయం. మొత్తానికి లేట్ వయసులో కూడా ఇలా వన్డేల్లో రికార్డులు సెట్ చేయడం రాజా వల్లే సాధ్యం అయింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Four-wicket haul ✅
Zimbabwe’s fastest ODI century ✅Sikandar Raza is the @aramco #POTM from #ZIMvNED 🙌#CWC23 pic.twitter.com/YSWvskRfYE
— ICC (@ICC) June 20, 2023