Gary Ballance: అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి నాలుగు నెలలైనా కాలేదు అప్పుడే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయం తీసుకుంది ఓ స్టార్ క్రికెటర్.. అతనెవరూ? ఎందుకు ఇలా చేశాడంటే..?
జాతీయ జట్టుకు ఆడాలని చాలా మంది ఎన్నో ఏళ్లుగా కష్టపడుతుంటారు. అదృష్టం బాగుండి ఆ అవకాశం తక్కువ వయసులోనే వస్తే.. తమ టాలెంట్‌తో కొన్ని ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తారు. లేటు వయసులో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చినా.. కనీసం ఐదారేళ్లు అయినా సరే ఆడాలని భావిస్తారు. కానీ.. ఒక క్రికెటర్ జాతీయ జట్టులోకి వచ్చిన కేవలం నాలుగు నెలలకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరి నాలుగు నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ప్లేయర్.. స్టార్ క్రికెటర్ ని సంభోదిస్తున్నారేంటి అని అనుమానపడకండి.. అసలు విషయం ఏంటంటే..?
జింబాబ్వే స్టార్ క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. గ్యారీ జింబాబ్వే జాతీయ జట్టుకు ఆడటం మొదలుపెట్టి కేవలం నాలుగు నెలలు మాత్రం అవుతుంది. కానీ, అంతకు ముందు ఇంగ్లండ్ జట్టుకు ఆడేవాడు. 2014లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గ్యారీ.. 2017 వరకు 23 టెస్టులు ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టు నుంచి ఉద్వాసనకు గురైయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కాలేదు. ఆ సమయంలో తన స్వదేశానికి ఆడాలని నిర్ణయించుకున్న గ్యారీ.. ఇంగ్లండ్ నుంచి జింబాబ్వేకు మకాం మార్చాడు.
2022 డిసెంబర్‌లో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేసిన గ్యారీ.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌తోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాలుగు నెలలకే గ్యారీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మిగిలిన జీవితాన్ని తన కుటుంబంతో గడపాలని నిర్ణయించుకుంటున్నట్లు గ్యారీ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 24 టెస్టులు ఆడిన గ్యారీ 1653 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 21 వన్డేల్లో 454 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాడు. ఒకే ఒక టీ20 ఆడి 30 పరుగులు చేశాడు. మరి గ్యారీ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gary Ballance has announced his retirement from international cricket.
He made his debut for his birth country, Zimbabwe a few months ago.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2023