శృంగారం.. ఇది ఒక గొప్ప అనుభూతి. మాటల్లో వర్ణించలేనిది, మరో దాంతో భర్తీ చేయలేనిది. భార్యాభర్తల మధ్య శృంగారం కేవలం సంతానోత్పత్తికే అనే భ్రమ నుంచి ముందు బయటకు రావాలి. శృంగారం అనేది స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని, అనుబంధాన్ని, ప్రేమానురాగాలను పెంచే ఒక ప్రక్రియ. దీని ద్వారా మీ ఆరోగ్య సమస్యలు తీరుతాయనే విషయం మీకు తెలుసా? ఇది ఒక మహత్తర కార్యం, సృష్టికి మూలం కూడా. అయితే దీని విషయంలో చాలా మంది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతారు. అందులో ముఖ్యంగా తమ భాగస్వామిని సంతృప్తి పరిచామా? లేదా? అనే సందేహం వారిని వెంటాడుతుంది. కానీ, దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయడం ఎంత ప్రమాదమో తెలుసుకోవడం లేదు.
భార్యాభర్తల మధ్య బంధాన్ని పెంపొందించడానికి శృంగారం అనేది ఒక వారధిలాంటింది. దానిని బంధాలను పెంపొందించుకోవడానికే వాడుకోవాలి కానీ.. సమస్యలు సృష్టించుకోవడానికి కాదు. ఇలా ఎందుకు చెబుతున్నామంటే.. చాలా మంది పడకగదిలో కొన్ని విషయాలను తెలుసుకోవాలని చూస్తుంటారు. వారి భాగస్వామిని పదే పదే కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. వాటిలో అతి ప్రధానమైనవి, ప్రమాదకరమైనవి ‘ఎలా అనిపించింది’, ‘నువ్వు సంతృప్తి చెందావా?’. పడకగదిలో ఓ పురుషుడు, స్త్రీని అస్సలు అడగకూడని ప్రశ్నలు ఇవి. పైగా వీటికి స్త్రీలు సమాధానం చెప్పరు. చెప్పినా చాలా వరకు అబద్ధమే చెబుతారు.
అలా అబద్ధం ఎందుకు చెప్పారు అని కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే వారు ఆ అబద్ధం చెప్పేది మీ మంచి కోసమే. ఎందుకంటే శృంగారం అనేది ప్రేమను పెంపొందించుకునే ఓ ప్రక్రియ. కానీ, మగతన్నాన్ని, శక్తి సామర్థ్యాలను కొలిచే ప్రక్రియ కాదు. అలా కొలవాలి అంటే దాదాపుగా అందరు మగాళ్లు ఓడిపోతారు. ఎందుకంటే శృంగారంలో స్త్రీని సంతృప్తి పరచడం అంత తేలికైన పనికాదు. ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం అలా సంతృప్తి పరచడం దాదాపుగా అసాధ్యం కూడా. ఒకవేళ స్త్రీలు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే చాలా మంది మగాళ్లకు రాత్రులు నిద్ర కూడా పట్టదు. అందుకే లేనిపోని ప్రశ్నలను లేవనెత్తడం మానేసి.. ప్రేమను పెంపొందించేందుకు శృంగారాన్ని వాడుకుంటే చాలా మంచిదని నిపుణులు సలహాలిస్తున్నారు.