బీఈ, బీటెక్ వంటి పైచదువులు చదివారా..? సైంటిస్ట్ కావాలన్నదే మీ కల! అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)’లో ఉద్యోగం చేయాలని చాలామంది కలలు కంటుంటారు. అందుకోసం వివిధ రకాల కోర్సులు నేర్చుకొని.. అనేక పరీక్షలు రాస్తుంటారు. అలాంటి వారికి ఇస్రో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/ యూనిట్‌లలో సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 65 ఖాళీలు భర్తీ చేయనున్నారు. కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
మొత్తం ఖాళీలు: 65
విభాగాలు:
అర్హతలు: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్ ఉత్తీర్ణులై వారు అర్హులు.
వయోపరిమితి: 24.05.2023 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 ప్రారంభ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అందరూ దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04.05.2023.
దరఖాస్తులకు చివరి తేదీ: 24.05.2023.