భారత దేశంలో ఇప్పటి వరకు ఇస్త్రో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ వచ్చింది. దేశం గర్వించే విధంగా నిన్న చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
టెక్నాలజీ రంగంలో మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. నిత్యం కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అంతరిక్ష రహస్యాలు ఛేదించే దిశలొ ఎన్నో ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. భారతీయ శాస్త్రవేత్తలు అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నారు. చంద్రుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడుతూ అంతరిక్ష పరిశోధనలో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తుంది. భారత కీర్తి ప్రతిష్టను మరింత ఇణుమడిపజేసే విధంగా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారు. నిన్న చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైందన్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2.35 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్వీఎం3-–ఎం4 రాకేట్ ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన చంద్రయాన్-3 ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ సరిగ్గా16 నిమిషాల కక్ష్యలోకి చేరింది.
చంద్రయాన్ -3 మిషన్ ప్రయోగంలో ఎంతోమంది మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఖమ్మంకు చెందిన యువశాస్త్రవేత్త ఈ జర్నీలో ఆపరేషన్ మేనేజర్ గా వ్యవహరించారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ పీఆర్‌డీఈ వల్లూరు కోటేశ్వరరావు తనయుడు వల్లూరి ఉమామహేశ్వరరావు 2013 ఇస్త్రో శాస్త్రవేత్తగా చేరారు. పదేళ్లుగా ఉమా మహేశ్వరరావు వివిధ ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. మొత్తానికి చంద్రయాన్ – 3లో ఆపరేషన్ మేనేజర్ గా ఆయనకు అవకాశం దక్కింది. ఆపరేషర్ డిజైనింగ్ విభాగాల్లో 1500 మంది పైగా పనిచేస్తున్నారు. ఆపరేషన్ మేనేజర్లుగా 30 మందిని సెలెక్ట్ చేసుకున్నారు.. వీరిలో ఉమామహేశ్వరరావు కూడా ఉండడం విశేషం. చంద్రయాన్-3 మిషన్ లో తాను ఒక భాగమైనందుకు ఎంతోసంతోషంగా ఉందని ఉమామహేశ్వరరావు అంటున్నారు.