ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ శుభవార్త చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులతో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులున్నాయి. ఇక.. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ- 1426, ఆంధ్రప్రదేశ్- 1934 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 02 నుంచి ప్రారంభమైంది. జూన్ 5 దరఖాస్తులకు చివరి తేది.
పదవ తరగతి పాసైనవారంతా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకొని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి రూ. 12000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/ డాక్ సేవక్ కి 10,000 వేతనం చెల్లిస్తారు.
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: 10వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.
వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులు. (SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది)
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు)
ఎంపిక విధానం: టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక.
సబ్‌మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్: 10వ తరగతి మెమో, ఫోటో, సంతకం.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 2, 2022
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 5, 2022
పూర్తి వివరాలకు ఇండియా పోస్ట్ వెబ్ సైట్(https://indiapostgdsonline.gov.in/) ను సంప్రదించండి.
India Post GDS recruitment 2022
Vacancy: 38,926 Posts
Full Notification: https://t.co/HjQPhNzhbB#indianpost #gds #jammu #jkbillboard #postoffice #indianpostoffice https://t.co/SZA7wn8P3G pic.twitter.com/RteYoWEUbR
— J&K Billboard (@jk_billboard) May 3, 2022