భారత నౌకాదళం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నేవీలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అదికూడా రూ.56,100 ప్రారంభ జీతంతో షార్ట్ సెర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్హతలు కలిగిన ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇవాళ్టి(అక్టోబర్ 21) నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసేందుకు నవబంర్ 6 ఆఖరి తేదీగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను joinindinannavy.gov.in అధికారకి వెబ్‌సైట్‌లో ప్రకటించారు. అయితే అసలు ఎవరు అర్హులు? ఏఏ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు? ఎంత జీతం ఇస్తారు? అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ మీకోసం..
ఇండియన్ నేవీ ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టులను బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పోస్టుకు తగిన స్పెషలైజేషన్ చేసుండాలి. పోస్టుకు తగినట్లుగా బీఈ/బీటెక్/ఎంటెక్/పీజీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/బీకాం/ఎంఈ చేసుండాలి. లేదంటే తత్సమాన కోర్సుల్లో పాసై ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి వసయు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అంతేకాకుండా ఆడ, మగ ఇద్దరూ కచ్చితంగా పెళ్లి కాని వారై(బ్యాచిలర్స్) ఉండాలి. ఎంపికైనా వారికి కేరళలోని భారత నౌకాదళ అకాడమీలో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పుకున్న విద్యార్హతల్లో చివరి సంవత్సరం చదువుతున్న వారుకూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు.