ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్మీ అగ్నివీరుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ సికింద్రాబాద్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.
ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించి పెళ్లి కాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తు ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా స్వీకరించడం ప్రారంభించింది. 2023-24 నియామక సంవత్సరంలో భాగంగా అగ్నిపథ్ పథకం కింద ఆర్మీలోకి అభ్యర్థుల ఎంపిక పరీక్ష కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆన్ లైన్ లో 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 మార్చి 15 వరకూ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని నియామక కార్యాలయం తెలిపింది. 2023 ఏప్రిల్ 17 నుంచి ఆన్ లైన్ లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి.. సమర్థవంతులను ఎంపిక చేస్తారు. నాలుగేళ్ళ కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ (ఆల్ ఆర్మ్స్)
అగ్నివీర్ టెక్నికల్ (ఆల్ ఆర్మ్స్)
అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ (ఆల్ ఆర్మ్స్)
అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ 10వ తరగతి ఉత్తీర్ణత (ఆల్ ఆర్మ్స్)
అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ 8వ తరగతి ఉత్తీర్ణత (ఆల్ ఆర్మ్స్)