రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్.. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. హేమాహేమీల్లాంటి స్టార్ క్రికెటర్లకే సాధ్యం కాని రికార్డులు నీళ్లు తాగినంత ఈజీగా కొట్టేశాడు. ఇంతకీ ఏంటి విషయం?
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో కేక పుట్టించే రీతిలో గెలిచింది. చెప్పాలంటే ఈ మ్యాచ్ పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అలాంటిది రాజస్థాన్ గెలవడం ఓ ఎత్తయితే.. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ లో కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లకే సాధ్యం కాని విధంగా, అది కూడా 21 ఏళ్లకే సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ సీజన్ మొదలవడానికి ముందు రాజస్థాన్ జట్టుపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. వాటిని తలకిందులు చేస్తూ మ్యాచులు ఆడుతోంది. చెప్పాలంటే స్లో పాయిజన్ లా మెల్లగా మ్యాచులు గెలుస్తూ, ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మరింత మెరుగుపరుచుకుంది. తాజాగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో అయితే 13 ఓవర్లకే 150 పరుగుల టార్గెట్ ని ఉఫ్ అని ఊదేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 149/8 స్కోరు చేసింది. వెంకటేష్ అయ్యర్ (57) తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగా ఆడలేదు.
ఛేదనలో రాజస్థాన్ కి తొలి ఓవర్ లోనే మంచి ఊపునిచ్చే ఆరంభం దక్కింది. ఏకంగా 26 పరుగులు వచ్చాయి. అక్కడ మొదలుపెడితే 13.1 ఓవర్లలోనే 151 రన్స్ కొట్టి అద్భుతమైన విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ని మరింత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ లో కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న యశస్వి జైస్వాల్ 98 పరుగుల దగ్గర ఆగిపోయాడు. అంతకు ముందు కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ లో అత్యంత వేగంగా ఈ మార్క్ ని అందుకున్న క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇతడి తర్వాత కేఎల్ రాహుల్ (14 బంతుల్లో), పాట్ కమిన్స్ (14 బంతుల్లో), యూసఫ్ పఠాన్ (15 బంతుల్లో), సునీల్ నరైన్ (15 బంతుల్లో) ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ఐపీఎల్ లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లకే సాధ్యం కానిది జైస్వాల్ చేసి చూపించాడు. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Fastest FIFTY in the IPL
Yashasvi Jaiswal brings up his half-century in just 13 deliveries 👏👏#TATAIPL #KKRvRR pic.twitter.com/KXGhtAP2iy
— IndianPremierLeague (@IPL) May 11, 2023