Virat Kohli, Vamika: ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్,ఫేస్ బుక్ ఇలా ఏది చూసుకున్నా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు కోహ్లీ సొంతం. కింగ్ ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలోకి వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా..
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్,ఫేస్ బుక్ ఇలా ఏది చూసుకున్నా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు కోహ్లీ సొంతం. కింగ్ ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలోకి వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా.. విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక ఫోటోకి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కూతురు వామికతో దిగిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో సోమవారం లక్నో-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. అనేక మలుపులు, భావోద్వేగాలు చోటు చేసుకున్న ఈ మ్యాచ్ సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ చిల్ అవుతూ కనిపించాడు. కూతురు వామికాతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర దిగిన ఫోటో ముచ్చట గొలిపేలా ఉంది. వెనుక నుంచి దిగిన ఈ ఫొటోలో విరాట్ కోహ్లీ క్యాప్ పెట్టుకొని కూతురు వామిక మీద చేయి వేస్తూ కనిపించాడు. ఈ ఫోటో చూసిన కొంతమంది అభిమానులు “ఈ రోజు ఇంటర్నెట్ లో ఇదే స్వీటెస్ట్ పిక్” అంటూ పేర్కొంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ కి టాప్ ఆర్డర్ బ్యాటర్లు (కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్) చెలరేగి ఆడడంతో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ప్రారంభంలో 3 వికెట్లు కోల్పోయి లక్నో టీమ్ తడబడినా.. స్టొయినీస్ మెరుపులతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే స్వల్ప వ్యవధిలో రాహుల్, స్టొయినీస్ అవుట్ కావడంతో ఆర్సీబీ గెలుపు ఖాయమనుకున్నారంతా. కానీ పూరన్ సునామి ఇన్నింగ్స్ తో హోరెత్తించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి మ్యాచ్ ని లక్నో వైపుకి తిప్పాడు. చివర్లో పూరన్.. సిరాజ్ బౌలింగ్ లో అవుట్ కావడంతో మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్లగా.. విజయం లక్నో టీమ్ నే వరించింది. మొత్తానికి ఆర్సీబీ టీమ్ ఓడిపోయినా.. విరాట్ కోహ్లీ ఒక్క ఫోటో పెట్టి అభిమానులని ఖుషి చేసాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
— Virat Kohli (@imVkohli) April 11, 2023