Virat Kohli: కింగ్ కోహ్లీ ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందు ఈ సీజన్‌లో తన సత్తా చూపిస్తానని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే తొలి మ్యాచ్‌లోనే సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ముంబై ప్రధాన బౌలర్‌ను టార్గెట్ చేసి మరీ కొట్టిన కోహ్లీ.. ఆ జట్టు బౌలింగ్ ఎటాక్ మొత్తాన్ని ఒత్తిడిలోకి నెట్టాడు.
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ శుభారంభం చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన పటిష్ట ముంబై ఇండియన్స్‌తో ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. ఆర్సీబీ ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్ ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి.. ఆరంభం నుంచే ఇద్దరు ఓపెనర్లు ఎదురుదాడికి దిగి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 2016లో కోహ్లీని గుర్తు చేశాడు. ఆ సీజన్‌లో ఏకంగా 4 సెంచరీలతో రెచ్చిపోయిన కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పుడు ఈ సీజన్‌ను కూడా అద్భుతంగా మొదలు పెట్టాడు. కేవలం 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులు చేసి.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అలాగే డుప్లెసిస్ సైతం 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 73 పరుగులు చేసి అదరగొట్టాడు. వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. ముంబై బౌలర్లు చేతులెల్తేశారు.
ముఖ్యంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ముంబై ప్రధాన బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను విరాట్ కోహ్లీ టార్గెట్ చేసి మరీ కొట్టాడు. గాయం నుంచి కోలుకుని చాలా కాలం తర్వాత గ్రౌండ్‌లోకి దిగిన ఆర్చర్‌కు చేదు అనుభవం మిగిల్చాడు కోహ్లీ. ఆర్చర్ బౌలింగ్‌కు రాక ముందు వరకు కాస్త నిదానంగా ఆడిన కోహ్లీ.. ఆర్చర్ బౌలింగ్‌కు రాగానే గేర్ మార్చేశాడు. ముంబైకి బుమ్రా లేని లోటును పూడ్చే బౌలర్‌గా ఆర్చర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, కోహ్లీ పక్కా ప్లాన్‌తో ఆర్చర్‌ను ఫస్ట్ ఓవర్‌లోనే టార్గెట్ చేసి కొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన ఆర్చర్‌ను.. ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి ఒత్తిడిలోకి నెట్టాడు. తొలి ఓవర్‌లోనే కోహ్లీ అగ్రెసివ్‌గా ఆడటంతో ఆర్చర్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్లు కనిపించింది. దీంతో అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా ఆర్చర్‌కు దక్కలేదు.
ఆర్చర్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, 2 సిక్సులతో కోహ్లీ ఒక్కడే 28 పరుగులు పిండుకున్నాడు. ప్రధాన బౌలర్‌నే ఇలా టార్గెట్ చేసి కొడుతుండటంతో మిగతా బౌలర్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లారు. ఆర్చర్‌ను కోహ్లీ టార్గెట్ చేస్తే.. మిగతా బౌలర్ల పని డుప్లెసిస్ పట్టాడు. దీంతో ఆర్సీబీ ఛేజింగ్ చాలా సులువైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 18 ఓవర్ల వరకు ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైన ముంబై.. చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సాధించింది. యువ క్రికెటర్ తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేసి ముంబై ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ విఫలం అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, టోప్లీ, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు. కరణ్ శర్మ 2 వికెట్లతో రాణించాడు. 172 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్ల కోల్పోయి ఊదేసింది. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్, ఆర్చర్ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Picture of the day!
King Kohli made Jofra Archer helpless! pic.twitter.com/TiSLlvN9DC
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023
]
Virat Kohli vs Jofra Archer today, the Best vs Best! 🥶pic.twitter.com/oowX6Ub4Gq
— S. (@Sobuujj) April 2, 2023