ఐపీఎల్ లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ మధ్య కీలక పోరు జరగనునుంది.ప్లే ఆఫ్ రేస్ సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడంతో ఒత్తిడంతా ఇప్పుడు డుప్లెసిస్ సేన మీదే ఉంది.
ఐపీఎల్ లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ మధ్య కీలక పోరు జరగనునుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కి ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. ఆర్సీబీ మాత్రం డూ ఆర్ డై మ్యాచ్. ప్లే ఆఫ్ రేస్ సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడంతో ఒత్తిడంతా ఇప్పుడు డుప్లెసిస్ సేన మీదే ఉంది. కోహ్లీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా.. ఈ మ్యాచులో సన్ రైజర్స్ ఓడిపోవాలని ఫ్యాన్స్ సైతం కోరుకోవడం విశేషం. అయితే ఇప్పుడు ఆర్సీబి జట్టుని కోహ్లీ రూపంలోఒక కొత్త టెన్షన్ వెంటాడుతుంది.
విరాట్ కోహ్లీకి ఐపీఎల్ లో ఎన్ని రికార్డులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడొక చెత్త రికార్డ్ విరాట్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ తెప్పిస్తుంది. గత సీజన్ లో కోహ్లీ సన్ రైజర్స్ మీద ఆడిన రెండు మ్యాచుల్లో కూడా డకౌట్లుగా వెనుదిరిగాడు. ఈ రెండు మ్యాచుల్లో పరుగులేమి చేయకపోగా.. తొలి బంతికే ఔటవ్వడం విశేషం. అసలే కీలక మ్యాచులో ఇలాంటి రికార్డ్ ఇప్పుడు ఆందోళనకి గురి చేస్తుంది. ఇప్పటికే సన్ రైజర్స్ మీద కీలక మ్యాచులో బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంటే.. ఇపుడు విరాట్ సన్ రైజర్స్ మీద ఆడిన చివరి రెండు మ్యాచులు గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగడం ఇప్పుడు ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులని ఆందోళనకి గురి చేస్తుంది. మరి ఈ మ్యాచులో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడి ఆ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.