మీరు విన్నది కరెక్టే. మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఏకంగా త్రిష వచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఎల్లో కలర్ డ్రస్ వేసుకురావడమే కాదు, ఫుల్ గా సపోర్ట్ చేస్తూ తెగ సందడి చేసింది.
ఐపీఎల్ లో మీరు ఏ టీమ్ ని తీసుకున్నా సరే జస్ట్ అభిమానులు ఉంటారేమో. ఆర్సీబీ, సీఎస్కే, ముంబయి జట్లకు మాత్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటార్రా బాబు! ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. ఈ జట్లు మ్యాచ్ ఆడుతుంటే నరాలు తెంపేసుకుంటారు. టీవీలకు అతుక్కుపోతారు. స్టేడియంలో ఉంటే మాత్రం అరిచి అరిచి రచ్చ చేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ లో అలాంటి సీనే కనిపించింది. ఏకంగా స్టార్ హీరోహీరోయిన్సే మ్యాచ్ చూడటానికి వచ్చారు. సపోర్ట్ చేస్తూ రకరకాల ఎమోషన్స్ తో తెగ సందడి చేశారు. ఇది సీఎస్కే రేంజ్!
అసలు విషయానికొస్తే.. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు ఏదైనా ఉందంటే చాలామంది చెప్పే పేరు చెన్నై సూపర్ కింగ్స్. క్రేజ్ తోపాటు కప్పులు గెలుచుకోవడంలో సీఎస్కే ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఫ్యాన్ బేస్ ని మెంటైన్ చేయాలన్నా చెన్నైకే సాధ్యం. ఎందుకంటే సీఎస్కే ఫ్యాన్స్ అంటేనే అభిమానిస్తారు, అడిగితే ప్రాణం కూడా ఇచ్చేస్తారు! అలా ఉంటారు. అందుకే చెన్నై మ్యాచులు జరుగుతుంటే.. నార్మల్ ఆడియెన్స్ తో పాటు తమిళ స్టార్స్ అందరూ మ్యాచ్ చూడటానికి ఏకంగా స్టేడియంకి వచ్చేస్తుంటారు. రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా అలా చాలామంది కనిపించారు.
తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫేమ్ సంపాదించిన త్రిష.. తాజాగా చెపాక్ స్టేడియంలో సందడి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి ఇది 200వ మ్యాచ్ కావడంతోనే ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. త్రిష సీఎస్కేకు సపోర్ట్ చేయడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈమెతోపాటు హీరోయిన్స్ బింధుమాధవి, మేఘా ఆకాశ్, హాస్యనటుడు సతీష్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరో ఉదయనిధి స్టాలిన్ తదితరులు నిన్న మ్యాచ్ చూసేందుకు విచ్చేశారు. అంతకుముందు చెన్నై ఆడిన మ్యాచ్ లకూ తమిళ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. ఇలా నార్మల్ ఫ్యాన్స్ తోపాటు సెలబ్రిటీల అభిమానాన్ని దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ టీమ్ అంటే చెన్నై అనే చెప్పొచ్చు. మరి ఇదంతా చూస్తుంటే మీకేం అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్ చేయండి.
Celebrities today #CSKvsRR #trisha#bindumadhavi#MeghaAkash #udaynidhistain pic.twitter.com/GNRIgQTQeb
— Dinesh (@Dineshdynamic24) April 12, 2023