అసలే బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోయి చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్న సూర్యకుమార్ కు మరో ప్రాబ్లమ్ వచ్చిపడింది. దీంతో టీమిండియాలో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇంతకీ ఏంటి విషయం?
టీమిండియాలోకి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఒకప్పుడైతే దేశవాళీలు మ్యాచులు ఏళ్లకు ఏళ్లకు ఆడి ప్రూవ్ చేసుకుంటూనే గానీ జట్టులో చోటు దక్కేది కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశవాళీల్లో ఆటని గమనిస్తున్న సెలక్టర్స్.. ఐపీఎల్ లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉంటే, వాళ్లకు చాలా ఫాస్ట్ గా జాతీయ జట్టులో అవకాశాలు కల్పిస్తున్నారు. ఒకవేళ వాళ్లు నిరూపించుకుంటే.. జట్టులో పర్మినెంట్ చేసేస్తున్నారు. బుమ్రా, హార్దిక్ పాండ్య అలా వచ్చినవాళ్లే. ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన ఈ ఇద్దరూ ఇప్పుడు టీమిండియాకు బ్యాక్ బోన్ గా మారిపోయారు. అలానే వచ్చి మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లో ముంబయి తరఫున ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడి వెలుగులోకి వచ్చిన సుర్యకుమార్, చాన్నాళ్ల వెయిటింగ్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. టీ20ల్లో ధనాధన్ బ్యాటింగ్ తో ‘మిస్టర్ 360’గానూ పేరు తెచ్చుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం 906 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కానీ అది మొన్నటివరకు మాత్రమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సూర్య ఘోరంగా ఫెయిలవుతున్నాడు. రన్స్ కొట్టడానికే తెగ ఇబ్బందిపడుతున్నాడు. ఐపీఎల్ లో అయితే ఇలా క్రీజులోకి వచ్చి, అలా డకౌట్ అయి వెళ్లిపోతున్నాడు. బెంగళూరుపై 15, చెన్నైపై 1, తాజాగా దిల్లీతో మ్యాచ్ లో డకౌట్ అయిపోయాడు.
సూర్యకుమార్ గత ఏడు ఇన్నింగ్స్ లే తీసుకుంటే వరసగా 0, 1, 15, 0, 0, 0, 8 రన్స్ మాత్రమే కొట్టాడు. అంటే గత 26 రోజుల్లో నాలుగోసారి డకౌట్ అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. దీనికి తోడు దిల్లీతో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ క్యాచ్ పట్టే క్రమంలో కంటిపై గాయమైంది. ఇది పెద్దది కానట్లే కనిపిస్తోంది. ఒకవేళ ఏమైనా తేడా కొడితే మాత్రం సూర్య, టీమిండియా కెరీర్ క్లోజ్ అయిపోయే అవకాశముంది. ఎందుకంటే నవంబరులో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. సూర్య గనక ఇలానే ఆడితే మాత్రం.. అతడిని టీమ్ లోకి తీసుకునేది అనుమానమే! సూర్య వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. వీటన్నింటికీ టీమిండియా మేనేజ్ మెంట్ లెక్కలోకి తీసుకుని సూర్యని పక్కనబెట్టినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి సూర్య వరస దెబ్బలు తగులుతుండటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
SKY’S 4th GOLDEN DUCK IN 26 DAYS! 👀👀👀
A dropped catch, struck by the ball above the eye socket, and a golden duck – Suryakumar Yadav can’t catch a break! #IPL2023 #DCvsMI pic.twitter.com/cColJ4JCXi
— Cricbuzz (@cricbuzz) April 11, 2023