ముంబయి-బెంగళూరు మ్యాచ్ లో క్రేజీ సంఘటన జరిగింది. ముంబయికి ఆడుతున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మని చూసి సిరాజ్ భయపడిపోయాడు! బౌలింగ్ లో పూర్తిగా శ్రుతి తప్పాడు.
ముంబయితో మ్యాచ్ లో బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం సాధించింది. కోహ్లీ (82 నాటౌట్), డుప్లెసిస్ (73) అదరగొట్టారు. దీంతో ఆర్సీబీ.. గెలుపుతో ఈ సీజన్ ని స్టార్ట్ చేసింది. ‘ఈసాలా కప్ నమ్ దే’ అని ఫ్యాన్స్ ఆల్రెడీ అంచనాలు పెంచేసుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ హైదరాబాదీ బ్యాటర్ కు మరో హైదరాబాదీ బౌలర్ భయపడ్డాడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ స్లోగన్స్ తో దద్దరిల్లిపోయింది. అందుకు తగ్గట్లే ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయిని ఆర్సీబీ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కానీ చివరి 5 ఓవర్లు మాత్రం చేతులెత్తేశారు. ముంబయికి ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. ఒంటిచేత్తో మ్యాచ్ ని లాక్కొచ్చాడు. 46 బంతుల్లో 84 రన్స్ కొట్టిన ఇతడు.. స్టార్ గా మారిపోయాడు. అదే టైంలో తిలక్ ని చూసి ఆర్సీబీ బౌలర్ సిరాజ్ భయపడినట్లు కనిపిస్తున్నాడు.
ఎందుకంటే.. ముంబయితో మ్యాచ్ లో తొలి 3 ఓవర్లు చాలా పకడ్బందీగా బౌలింగ్ చేసిన సిరాజ్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఏమైనా రికార్డు సెట్ చేస్తాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ 19వ ఓవర్ వేసిన సిరాజ్.. ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక్కడ రన్స్ ఇవ్వడం తప్పు కాదు. కానీ క్రీజులో తిలక్ వర్మ ఉన్నాడనో ఏమో గానీ ఏకంగా ఓవర్ లో 11 బంతులేశాడు. అందులో 5 వైడ్స్ ఉన్నాయి. ఇదే ఓవర్ లో రెండు ఫోర్లు కూడా కొట్టారు. ఇదంతా చూసిన నెటిజన్స్.. తిలక్ వర్మకు సిరాజ్ భయపడిపోయాడని మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.