టీమిండియాకు దొరికిన లెజెండ్ ధోనీ. మన దేశంలో సాధారణ ప్రజల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అతడి అభిమానులే. తాజాగా ఓ స్టార్ సింగర్.. అందరి ముందు ధోనీ పాదాలని తాకిన ఫొటో వైరల్ గా మారింది.
ఇంతకు ముందు జనరేషన్ కు క్రికెట్ అంటే సచిన్ గుర్తొచ్చేవాడు. కానీ ఆ తర్వాత ధోనీ ఆ ప్లేసులోకి వచ్చేశాడు. టీమిండియా కెప్టెన్ గా ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఘనతల్ని సాధించాడు. ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు, టీమిండియా సొంతమయ్యేలా చేశాడు. మూడేళ్ల క్రితమే ధోనీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ అతడి పేరు మార్మోగుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సందర్భంగానూ ధోనీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లిపోయింది. అయితే ఓ ఫొటో మాత్రం నెటిజన్లని తెగ ఎట్రాక్ట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్-16వ సీజన్ ని అంగరంగ వైభవంగా స్టార్ట్ చేశారు. అహ్మదాబాద్ లో తమన్నా, రష్మిక లాంటి హీరోయిన్లతో డ్యాన్సులు వేయించి మరీ టోర్నీపై హైప్ తీసుకొచ్చారు. ఇక హిందీ సాంగ్స్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించిన అర్జిత్ సింగ్ అయితే తన సాంగ్స్ తో స్టేడియంలో ఉన్న అందరినీ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. ఇక అతడు ‘బ్రహ్మాస్త్ర’ మూవీలోని ‘దేవా దేవా’ సాంగ్ పాడుతున్న టైంలో ధోనీని చూపించారు. ఇక ఫ్యాన్స్ అయితే అరిచి అరిచి గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
అలానే ఐపీఎల్ మ్యాచుకు ముందు స్టేజీ ఫెర్ఫార్మెన్సులు పూర్తయిన తర్వాత చెన్నై కెప్టెన్ ధోనీ స్టేజీపైకి వెళ్లాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న స్టార్ సింగర్ అర్జిత్ సింగ్.. ధోనీ పాదాలని తాకాడు. ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహీ ఫ్యాన్స్ కు చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. నార్మల్ ప్రజలు ఫ్యాన్స్ గా ఉండటం కాదు.. ఏకంగా స్టార్ సెలబ్రిటీలే ధోనీకి డైహార్డ్ అభిమానులుగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా తొలి మ్యాచ్ లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. సరే ఇదంతా పక్కనబెడితే స్టార్ సింగర్ ధోనీ కాళ్లు మొక్కడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Picture of the day 💛#ArjitSingh touches #MSDhoni feet to seek the blessings 😍
#IPL2023 #ChennaiSuperKings#WhistlePodu #Yellove pic.twitter.com/HC3uZ6c2Yw— Revathy #CSK 🦁💛 (@revathyharini) March 31, 2023