రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఓ వరస్ట్ రికార్డుని నమోదు చేశాడు.
రోహిత్ శర్మ.. ఈ పేరు చెప్పగానే రికార్డులే గుర్తొస్తాయి. టీమిండియా తరఫున ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. బ్యాటర్ గా తనదైన మార్క్ చూపించాడు. అలాంటి రోహిత్ శర్మ.. కొన్నాళ్ల ముందు భారత జట్టుకి కెప్టెన్ అయ్యాడు. అప్పటినుంచి బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిలవుతున్నాడు. సరే ఈసారి ఐపీఎల్ లో అయినా కుదురుకుంటాడా అంటే అదీ లేదు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ లోనూ 7 పరుగులకు ఔటైన రోహిత్.. ఓ వరస్ట్ రికార్డుని క్రియేట్ చేశాడు. చెప్పాలంటే తను సృష్టించినది తానే బ్రేక్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ శర్మని వంకపెట్టడానికి ఏం లేదు. కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్ లో ఆడేవాడు. అప్పుడు అంత పేరు ఏం రాలేదు. ధోనీ వల్ల 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఓపెనర్ అవతారమెత్తాడు. ఇక అప్పటినుంచి చూసుకోండి. బ్యాటింగ్ లో దంచుడే దంచుడు అన్నట్లు ఆడేవాడు. వన్డే, టీ20, టెస్టు ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతాలు చేశాడు. ఐపీఎల్ లోనూ ముంబయి కెప్టెన్ వండర్స్ క్రియేట్ చేశాడు. ఏకంగా ఐదు కప్పులు సాధించాడు.
అంతా బాగానే ఉంది. కానీ ఈసారి ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవుతున్నాడు. గత ఐదు మ్యాచుల్నే తీసుకుంటే 2,3,0,0,7 పరుగులు చేశాడు. ఇలా ఓ సీజన్ లో వరసగా ఐదు సింగిల్ డిజిట్ స్కోరు చేయడం ఇదే తొలిసారి. గతంలో 2017 ఐపీఎల్ లోనూ రోహిత్ శర్మ వరసగా నాలుగు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇలా తన పేరిట ఉన్న వరస్ట్ రికార్డుని తానే బ్రేక్ చేశాడనమాట. మరి రోహిత్ బ్యాటింగ్, వరస్ట్ రికార్డులు నమోదు చేస్తుండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Five back-to-back single-digit scores for Rohit Sharma in IPL 2023.
His struggle continues in IPL.
📸: Jio Cinema#IPL2023 pic.twitter.com/KG8CBAdgn6
— CricTracker (@Cricketracker) May 9, 2023