ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. చివరిదాక క్రీజ్ లో నిలుచుని జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక రోహిత్ చేసిన పనికి నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఐపీఎల్ 2023 సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో రాత్రి జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో పాయింట్ల ఖాతా తెరిచింది ముంబై. దాంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ ను వరుస పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. చివరిదాక క్రీజ్ లో నిలుచుని జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక రోహిత్ చేసిన పనికి నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఇంతకి మ్యాచ్ అనంతరం రోహిత్ చేసిన పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీ-ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్తంఠగా సాగిన ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. 173 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది ముంబై. ఢిల్లీ జట్టులో వార్నర్, అక్షర్ పటేల్ లు అర్ధశతకాలతో చెలరేగారు. ముంబై జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు రోహిత్. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా రోహిత్ కే దక్కింది. ఈ క్రమంలోనే ఈ అవార్డు తీసుకున్న అనంతరం రోహిత్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న వెంటనే.. తన భార్య రితికకు వీడియో కాల్ చేశాడు రోహిత్. నా ఐపీఎల్ కెరీర్ లో ఇలాంటి మ్యాచ్ చూడలేదని చెప్పుకొచ్చాడు. రితిక కూడా ఈ మ్యాచ్ ను చూశానని, నీ బ్యాటింగ్ నచ్చిందని రోహిత్ తో చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో మ్యాచ్ కాగానే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోవడంతో.. రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Rohit Sharma talking with his wife after the first win.
A beautiful video. pic.twitter.com/tkElLdNH5c
— Johns. (@CricCrazyJohns) April 12, 2023