Rohit Sharma, IPL 2023: దాదాపు రెండేళ్ల క్రితం రోహిత్ అర్ధ సెంచరీ చేసాడు. చివరిసారిగా 2021 చెన్నై చిదంబరం స్టేడియంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 62 పరుగులు చేసాడు. ఆ తర్వాత 23 ఇన్నింగ్స్ లు ఆడినా.. అర్ధ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు.
ఐపీఎల్‌లో చాలా రోజుల తర్వాత రోహిత్ తన బ్యాట్‌కి పని చెప్పాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో.. టిమ్ డేవిడ్, కామెరున్ గ్రీన్ చివర్లో ఒత్తిడిని అధిగమించి ముంబై ఇండియన్స్ జట్టుని విజయ తీరాలకు చేర్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ద్వారా హిట్ మ్యాన్ ఖాతాలో ఒక రికార్డ్ ఇంకా పదిలంగానే ఉండడం విశేషం.
దాదాపు రెండేళ్ల క్రితం రోహిత్ అర్ధ సెంచరీ చేసాడు. చివరిసారిగా 2021 చెన్నై చిదంబరం స్టేడియంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 62 పరుగులు చేసాడు. ఆ తర్వాత 23 ఇన్నింగ్స్ లు ఆడినా.. అర్ధ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. ఫామ్ లో లేకపోయినా ఈ ముంబై కెప్టెన్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. పేపర్ మీద ఎంతో బలంగా కనిపించే ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ విఫలమవడం పెద్ద సమస్యగా అనిపించలేదు. ఇదిలా ఉండగా.. నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రోహిత్ శర్మ.. ఈ అవార్డుల సంఖ్యను 19 కి పెంచుకున్నాడు.తద్వారా ఐపీఎల్ లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న భారత ప్లేయర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ లిస్టులో భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (17) రెండో స్థానంలో ఉన్నాడు. గత రెండేళ్లుగా ఫామ్ లో లేకపోయినా.. రోహిత్ పేరిట ఈ రికార్డ్ ఇంకా అలాగే ఉండడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 172 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్(54) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ వార్నర్(51) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై కి ఓపెనర్లు కిషాన్, రోహిత్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఇక ముంబై విజయ్ ఖాయం అనుకుంటున్నా దశలో స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివర్లో ఢిల్లీ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాటర్లు కాస్త తడబడినా చివరికి విజయం సాధించారు. గత 24 ఇన్నింగ్స్ లో కేవలం ఒకే సారి హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న లిస్టులో ఇంకా అగ్ర స్థానంలో కొనసాగడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Welcome back, Rohit Sharma.
19th player of the match award in IPL history. pic.twitter.com/N1O8KCy3fL
— Johns. (@CricCrazyJohns) April 11, 2023