ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఓ అద్భతమైన క్యాచ్ చోటుచేసుకుంది. కామెరూన్ గ్రీన్ కొట్టిన భారీ షాట్ ను కళ్లు చెదిరే రితీలో ఒడిసి పట్టుకున్నాడు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే క్యాచ్ పట్టుకునే టైమ్ లో జడేజా కళ్లు మూసుకోవడం విశేషం.
సాధారణంగా క్రికెట్ లో ఓ సామెత ఉంది. అదేంటంటే? ‘టేక్ ది క్యాచ్ విన్ ది మ్యాచ్’. క్యాచ్ లు మిస్ చేసి చేజేతులా మ్యాచ్ లు ఓడిపోయి సందర్భాలు ప్రపంచ క్రికెట్ లో కోకొల్లలు. ఇక అద్భుతమైన క్యాచ్ లను అంతే అత్యద్భుతంగా ఒడిసి పట్టి మ్యాచ్ ను గెలిపించిన సంఘటనలు మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన క్యాచే తాజాగా ఐపీఎల్ 2023లో నమోదు అయ్యింది. ఈ క్యాచ్ ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ లో చోటుచేసుకుంది. కామెరూన్ గ్రీన్ కొట్టిన భారీ షాట్ ను కళ్లు చెదిరే రితీలో ఒడిసి పట్టుకున్నాడు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. చెన్నై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయ్యింది. ప్రారంభం నుంచి ముంబై కంటిన్యూస్ గా వికెట్లు కోల్పోతూనే వచ్చింది. చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. ముంబై బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడ్డారు. ముంబై జట్టులో ఇషాన్ కిషన్ చేసిన 32 పరుగులే టాప్ స్కోర్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి స్టార్ ఆల్ రౌండర్ అయిన కామెరూన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపాడు జడేజా. మనం ఇదివరకు ఎన్నో క్యాచ్ లు చూసి ఉంటాం కానీ ఇలాంటి క్యాచ్ మాత్రం ఇప్పటి వరకు చూడలేదు అనే చెప్పాలి.
ఈ మ్యాచ్ లో జడేజా వేసిన ఇన్నింగ్స్ 8.2వ బంతిని స్ట్రైట్ గా భారీ షాట్ ఆడాడు గ్రీన్. దాంతో ఆ భారీ షాట్ కు జడేజా సైతం కళ్లు మూసుకున్నాడు. కానీ కచ్చితంగా బాల్ గమనాన్ని గమనించి తన చేతులను కరెక్ట్ గా పెట్టాడు. దాంతో బాల్ వచ్చి సరాసరి జడ్డూ చేతుల్లో పడింది. అయితే క్యాచ్ పట్టే సమయంలో కళ్లు మూసుకోవడం ఇక్కడ నవ్వు తెప్పించే విషయం. జడేజా ఎంత స్టార్ ఫీల్డరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుత వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్లలో జడేజా ఒకడు. ఇక ఇలా కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో.. గ్రీన్ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాడు. ఇక ఈ క్యాచ్ జడేజా పట్టడు అనుకున్నాడో ఏమో అంపైర్ బయపడి.. కిందపడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. భయ్యా కళ్లు మూసుకుని సిక్స్ కొట్టడం చూశాం గానీ.. ఇలా కళ్లు మూసుకుని క్యాచ్ పట్టడం చూడ్డం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి జడేజా పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.