నాని 'జెర్సీ' మూవీని కల్పిత కథతో తీశారు. ఇప్పుడది ముంబయి ఇండియన్స్ కి ఆడుతున్న పీయూష్ చావ్లా జీవితంలో నిజంగానే జరిగింది. స్వయంగా ఈ స్టార్ బౌలర్ బయటపెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ లో ఎన్ని టీమ్స్ ఉన్నా కోట్లాదిమంది ముంబయి ఇండియన్స్ ని ప్రేమిస్తారు. క్రికెట్ లో ఎన్ని మూవీస్ వచ్చినాసరే నాని ‘జెర్సీ’కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్. ఎందుకంటే ఏదో ఆట కోసమన్నట్లు కాకుండా.. క్రికెట్ వల్ల ఓ ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎమోషనల్ చేసింది. కంటతడి పెట్టించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. ముంబయి ఇండియన్స్ జట్టులోనూ ‘జెర్సీ’ స్టోరీ రియల్ గా జరిగింది. ప్రస్తుతం ఆ విషయమే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొస్తే.. ఈసారి ఐపీఎల్ లో సీనియర్స్ అదిరిపోయే కమ్ బ్యాక్స్ ఇస్తున్నారు. ధావన్, రహానె, ఇషాంత్ శర్మ.. ఇలా చాలామంది ఉన్నారు. వీళ్లందరూ ఏమోగానీ పీయూష్ చావ్లా ఈ సీజన్ మొత్తానికే సర్ ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వయసు ప్రస్తుతం 34 ఏళ్లు. టీమిండియాకి అప్పుడెప్పుడో ఆడాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఫెర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే చేస్తూ వచ్చాడు. దీంతో అందరూ చావ్లాని మరిచిపోయారు. అలాంటిది ఈ సీజన్ లో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చి కేక పుట్టించాడు. 12 మ్యాచ్ ల్లో 19 వికెట్లు తీసి వావ్ అనిపిస్తున్నాడు.
కెరీర్ ఖతం అయిపోయింది ఇక ఎవరు తీసుకుంటారులే అని పీయూష్ చావ్లా కూడా లైట్ తీసుకున్నాడు. కానీ అతడి ఆరేళ్ల కొడుకు మాత్రమే ‘జెర్సీ’లో తండ్రి క్యారెక్టర్ కి కొడుకు పాత్ర చెప్పినట్లు.. టఆడు నాన్న నువ్వు ఆడితే హీరోలా ఉంటావ్’ అని చెప్తాడు. ఇప్పుడదీ చావ్లా లైఫ్ లో రియల్ జరిగింది. ఇది తన కమ్ బ్యాక్ కాదని, కొడుకు కోసమే ఆడుతున్నానని డైరెక్ట్ గా స్టేడియంలో అందరి ముందు చెప్పుకొచ్చాడు. తన కొడుకు కోసం ఏదైనా స్పెషల్ గా చేయాలనే ఇదంతా అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారిపోయింది. మరి చావ్లా కొడుకు కోసం కమ్ బ్యాక్ ఇచ్చి అదరగొడుతుండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.