రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ధోని మరో కప్ పట్టుకెళ్లిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదోసారి టైటిల్ విన్నర్‌గా నిలిపాడు. అయితే కప్ గెలిచినా ఒక ప్లేయర్‌పై మాత్రం ధోని సీరియస్ అయ్యాడు.
వరల్డ్ క్రికెట్లో బెస్ట్ కెప్టెన్లలో తాను ఒకడ్నని మరోసారి నిరూపించుకున్నాడు ఎంఎస్ ధోని. టీమిండియాకు ఎన్నో అరుదైన విజయాలు, ట్రోఫీలు అందించిన తల.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తిరుగులేని సారథిగా పేరు తెచ్చుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇప్పటికే నాలుగుసార్లు ట్రోఫీని అందించిన ధోని.. మరో టైటిల్‌ను ఆ టీమ్ ఒడిలో చేర్చాడు. పెద్దగా స్టార్లు లేని జట్టును తన కెప్టెన్సీ స్కిల్స్‌తో ఫైనల్‌కు తీసుకొచ్చిన ధోని.. అందుబాటులో ఉన్న ఆటగాళ్లను అద్భుతంగా వినియోగించుకొని కప్ ఎగరేసుకుపోయాడు. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లవే మెజారిటీ విజయాలు. కానీ వర్షం ముప్పు ఉండటంతో ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు ధోని. గుజరాత్ సంధించిన 214 రన్స్ భారీ స్కోరును ఛేధించడం చెన్నైకి కష్టమేనని అందరూ అనుకున్నారు.
వర్షం ఆగాక అర్ధరాత్రి మ్యాచ్ మళ్లీ మొదలైన తర్వాత చెన్నై గెలుపునకు 15 ఓవర్లలో 171 రన్స్ టార్గెట్‌గా నిర్దేశించారు. అయితే సీఎస్కే బ్యాటర్లు తగ్గేదేలే అంటూ దుమ్మురేపారు. ఆఖర్లో జడేజా ఒక సిక్స్, ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని, ట్రోఫీని అందించాడు. తన రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో 42 ఏళ్ల వయసులో మరో ట్రోఫీ అందుకొని కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు ధోని. కానీ ట్రోఫీ గెలిచినా కూడా ధోని ఒక ప్లేయర్ విషయంలో కాస్తంత సీరియస్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ అనంతరం తన దగ్గరకు ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన సీఎస్కే పేసర్ దీపక్ చాహర్‌పై ధోని సీరియస్ అయ్యాడు. అతడ్ని చూడగానే ధోనీకి కోపం వచ్చింది. ఆటోగ్రాఫ్ ఇవ్వనని.. అతడ్ని కాసేపు ఇబ్బంది పెట్టాడు. అయితే చివరకు చాహర్ టీషర్ట్‌పై ధోని సంతకం చేశాడు. ధోని రియాక్షన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Deepak Chahar came for autograph and MS Dhoni reaction 🤣🤣pic.twitter.com/n0xMu2KlOq
— 🎰 (@StanMSD) May 29, 2023