ఐపీఎల్ 2023 సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. మార్క్ వుడ్ రీ ఎంట్రీ మ్యాచ్ లో ఇరగదీశాడు. ఢిల్లీ జట్టును ఒంటిచేత్తే చుట్టేశాడు. ఐదేళ్ల తర్వాత ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో వుడ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్.. అందరూ అనుకున్నట్లుగానే ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు లక్నోని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా పోయింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మార్క్ వుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మార్క్ వుడ్ లేకుండా ఒకానొక సమయంలో ఢిల్లీ విజయం సాధించేదేమో అనే భావన కలగకపోదు. ఢిల్లీ బ్యాటర్లను వరుసబెట్టి పెవిలియన్ చేర్చి.. మార్క్ వుడ్ గట్టి దెబ్బే కొట్టాడు.
లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయంలో ఇద్దరి పేర్లు ప్రధానంగా చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా కైల్ మేయర్స్ అయితే.. బౌలింగ్ లో మాత్రం మార్క్ వుడ్ అనే చెప్పాలి. కైల్ మేయర్స్ 38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి లక్నో 193 పరుగులు సాధించడంతో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన మొదటి నాలుగు ఓవర్లలో ఢిల్లీ మ్యాచ్ గెలిచేస్తుందనిపిస్తుంది. అలాంటి సమయంలో మార్క వుడ్ మాయాజాలం స్టార్ట్ అయ్యింది. అప్పటివరకు 2 ఫోర్లసాయంతో 9 పరుగులు చేసి కాస్త టచ్ లో కనిపించిన పృథ్వీషాని మార్క్ వుడ్ బౌల్డ్ చేశాడు.
1️⃣ down, 1️⃣3️⃣ to go (at least)😉#LSGvDC | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/um20G6l4BW
— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2023
ఆ తర్వాతి బంతికే మిట్చెల్ మార్ష్ ని గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత సర్వఫరాజ్ ఖాన్ రూపంలో మూడో వికెట్ కూడా మార్క్ వుడ్ కే దక్కింది. ఢిల్లీతో మ్యాచ్ లో మార్క్ వుడ్ 5 వికెట్లు తీసి తన మార్క్ ని చూపించాడు. లక్నో తరఫున 5 వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్ గా మార్క్ వుడ్ రికార్డు సృష్టించాడు. ఇంక ఐపీఎల్ చరిత్రలో 5 వికెట్ల ఘనత సాధించిన 9వ బౌలర్ గా మార్క్ వుడ్ రికార్డులకెక్కాడు. 2018 ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడిన మార్క్ వుడ్ మళ్లీ ఇప్పుడు లక్నో తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. 2022లోనే లక్నో మార్క్ వుడ్ ని కొనుగోలు చేసినా కూడా.. గాయం కారణంగా అతను ఐపీఎల్ కి దూరమయ్యాడు.
This is a @MAWood33 appreciation post. Literally. 🫶#LSGvDC | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/e0qAjkxMJP
— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2023
రీ ఎంట్రీలో మాత్రం ఢిల్లీ జట్టును గడగడలాడించడమే కాకుండా.. మిగిలిన ప్లేయర్లకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లు అయ్యింది. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో ఇచ్చిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. వార్నర్(56), రొస్సోవ్(30) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఢిల్లీ జట్టులో మొత్తం 6 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మార్క్ వుడ్ అద్భుతమైన ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mark Wood… Outrageous 💥💥#IPL2023 pic.twitter.com/ipfmcSARBT
— Wisden (@WisdenCricket) April 1, 2023