విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించడానికి స్టార్లు ఆసక్తి చూపిస్తుంటే.. కోహ్లీ మాత్రం తన బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఎవ్వరు ఊహించని సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచాడు.
ప్రస్తుతం దర్శకులు బయోపిక్ మీద దృష్టిపెడుతున్నారు. కష్టపడి కథ రాసుకునే బదులు గొప్ప వ్యక్తుల జీవితాన్ని తెరకెక్కించడానికే ఆసక్తిగా చూపిస్తున్నారు. నిజానికి బయోపిక్ తీసి హిట్ కొట్టాలంటే అది సవాలుతో కూడుకున్నది. మనం రాసుకునే కథలో ఇష్టమొచ్చినట్టు సినిమాలో చూపించవచ్చు. కానీ బయోపిక్ తీసేటప్పుడు జరిగిందే చూపించాలి. ఏ మాత్రం తేడా కొట్టిన సినిమా ప్లాప్ అవ్వడంతో పాటుగా విమర్శలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒకరి జీవితాన్ని తెరకెక్కించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ప్రస్తుతం ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో ఎవరు నటిస్తారు అనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లీ తన బయోపిక్ లో ఎవరు నటిస్తారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
భారత్ క్రికెట్ దిగ్గజాలుగా పేరుగాంచిన కపిల్ దేవ్ ,సచిన్, అజహారుద్దీన్, ధోని బయోపిక్ లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విరాట్ వంతు వచ్చింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బయోపిక్ తెరకెక్కించడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఇప్పటికే విరాట్ బయోపిక్ లో నటించాలని తమ మనసులోని మాట చెప్పేసారు. అయితే ఇటీవలే విరాట్ కోహ్లీ.. రాబిన్ ఉతప్పకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ బయోపిక్ లో ఎవరు నటిస్తారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా కోహ్లీ ఎవ్వరు ఊహించని ఆన్సర్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. నా బయోపిక్ లో నేనే నటిస్తా అని నవ్వేసాడు.
నిజంగా విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే వాటికి ప్రత్యేకంగా కమర్షియల్ ఎలెమెంట్స్ వెతుక్కునే అవసరం ఉండదు. ఎందుకంటే కోహ్లీ జీవితం అంత సాఫీగా ఏమి సాగలేదు. ఈ స్టార్ క్రికెటర్ లైఫ్ లో చాలానే మలుపులు ఉన్నాయి. 19 ఏళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన విరాట్.. ఆ బాధని అధిగమిస్తూ అండర్ 19 వరల్డ్ కప్ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెస్టుల్లో టీమ్ ఇండియాకి విజయాలందించిన తీరు, కుంబ్లేతో సఖ్యత లేకపోవడం, రవి శాస్త్రీ తో సాన్నిహిత్యం,, రోహిత్ శర్మతో ఈగో, బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఈ మొత్తం బాగోతాన్ని స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టడం, ఇలా ఒక సినిమాకి కావాల్సిన అన్ని ఎమోషన్స్ కోహ్లీ జీవితంలో ఉండడం విశేషం.
ప్రస్తుతం ఇండియన్ క్రికెటలలోనే కాదు ప్రపంచ క్రికెట్ లో కోహ్లీ ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. కోహ్లీ బయోపిక్ నిజాంగానే తెరకెక్కితే అభిమానులకి పండగే. మరి అనుష్క శర్మ హీరోయిన్ సహకారంతో రిటైర్మెంట్ తర్వాత సినిమాలోకి వెళ్తాడా అనే విషయం తెలియాల్సి ఉంది. అనుష్క శర్మ ని కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఉతప్పకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ నిజం చెప్పాడా ? లేదా సరదాగా చెప్పాడా ? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.