కోహ్లీ దురదృష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడది ఐపీఎల్ లోని మిగతా జట్ల క్రికెటర్లపై పడినట్లు కనిపిస్తుంది. తాజాగా లక్నో సూర్య ఔట్ కావడంతో ఇదికాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?
లక్నోతో మ్యాచ్ లో ముంబయి స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ 7 రన్స్ కే ఔటయ్యాడు. అసలు దీనితో కోహ్లీకి సంబంధం ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా అనుకోవచ్చు. కానీ ఈ మొత్తం స్టోరీ చదివిన తర్వాత కోహ్లీ బ్యాడ్ లక్ కి ఎంత పవర్ ఉందనేది మీకే క్లారిటీ వచ్చేస్తుంది. వినడానికి కాస్త ఫన్నీగా ఉండొచ్చు కానీ రియాలిటీలో సూర్యతోపాటు పలువురు స్టార్ ప్లేయర్స్ విరాట్ దెబ్బకు బలైపోయారు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే కీలకమైన మ్యాచ్ లో ముంబయి చేతులెత్తేసింది. లక్నోపై కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 177/3 స్కోరు చేసింది. ఛేదనలో ముంబయి ఓ దశలో గెలిచేలా కనిపించింది. కానీ చివర్లో మోసిన్ సూపర్ బౌలింగ్ వల్ల గెలవలేకపోయింది. దీంతో ముంబయికి ప్లే ఆఫ్ ఛాన్సులు మరింత కష్టమైపోయాయి. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ కేవలం 9 బంతుల్లో 7 పరుగులు మాత్రమే ఔట్ అయిపోవడం ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టింది.
లక్నో-ముంబయి మ్యాచ్ జరిగింది. దీంతో కోహ్లీకి సంబంధం ఏంటని అంటారా? అక్కడికే వచ్చేస్తున్నాం. ఈ మధ్య కోహ్లీ.. ఐపీఎల్ లోని మిగతా జట్లలోని ఎవరైనా బాగా ఆడుతుంటే ఇన్ స్టాలో స్టోరీ పెడుతున్నాడు. రీసెంట్ గా వృద్ధిమాన్ సాహా, యశస్వి జైస్వాల్ బాగా ఆడారని పోస్ట్ పెట్టాడు. నెక్స్ట్ మ్యాచ్ ల్లో వీళ్లిద్దరూ డకౌట్ అయిపోయారు. గుజరాత్ తో లాస్ట్ మ్యాచ్ లో సూర్య సెంచరీ చేయడంతో కోహ్లీ.. అతడిని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టాడు. తాజాగా లక్నోతో మ్యాచ్ లో 7 రన్స్ కే ఔటైపోయాడు. ఇలా ముగ్గురు తక్కువ స్కోర్లు చేయడం చూసిన నెటిజన్స్.. కోహ్లీ బ్యాడ్ లక్ మిగతా ప్లేయర్లపై కూడా పడుతోందిరా బాబు అని మాట్లాడుకుంటున్నారు. ఈ లిస్టులో నెక్స్ట్ గిల్ ఉన్నాడు. రీసెంట్ గా గిల్ సెంచరీపై కోహ్లీ పోస్ట్ పెట్టాడు. తర్వాతి మ్యాచ్ లో అతడు ఏం చేస్తాడనేది చూడాలి. మరి మేం చేసిన అబ్జర్వేషన్ పై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.