బెంగళూరు జట్టుకి, అభిమానులకి ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. వరుసగా మిడిల్ ఆర్డర్ విఫలమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టులోకి సీనియర్ ప్లేయర్ కేదార్ జాదవ్ చేరబోతున్నాడు. మరి అనుభవం ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి.
ఐపీఎల్ లో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాప్ ఆర్డర్ రాణిస్తుంటే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమవుతుంది. ఒక మ్యాచులోనైతే పర్వాలేదు. ప్రతి మ్యాచులో ఇదే రిపీట్ అవుతుంది. బెంగళూరు జట్టుని గమనిస్తే టాప్ ఆర్డర్ ప్లేయర్లు అయినటువంటి కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో 80 శాతం పరుగులు చేయడం గమనార్హం. దీన్ని బట్టి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చెత్త ప్రదర్శన చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఆ జట్టులోకి సీనియర్ ప్లేయర్ కేదార్ జాదవ్ చేరనున్నాడు
బెంగళూరు జట్టుకి, అభిమానులకి ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. వరుసగా మిడిల్ ఆర్డర్ విఫలమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టులోకి సీనియర్ ప్లేయర్ కేదార్ జాదవ్ చేరబోతున్నాడు. జాదవ్ గతంలో 2016, 2017 సీజన్లలో ఆర్సీబీ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెన్నై, సన్ రైజర్స్ తరపున ఆది పర్వాలేదనిపించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి బెంగళూరు జట్టులో అడుగుపెడుతున్నాడు. గాయపడ్డ డేవిడ్ విల్లీ స్థానంలో కేదార్ జాదవ్ ని తీసుకున్నారు. జాదవ్ ప్రస్తుతం ఏమంత ఫామ్ లో లేకపోయినా ప్రస్తుతం ఐపీఎల్ లో సీనియర్ ప్లేయర్లు అయినటువంటి రహానే, విజయ్ శంకర్ అదరగొడుతున్నారు. ఏ నేపథ్యంలో జాదవ్ నుంచి ఏమైనా అద్భుత ప్రదర్శన వస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
View this post on Instagram
A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)