ipl 2023 చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఓ సిక్సర్ ను అడ్డుకోబోయిన విలియమ్సన్ మోకాలికి బలమైన గాయం అయ్యింది. దాంతో విలియమ్సన్ పూర్తిగా ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం అయ్యాడు. అయితే ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ న్యూజిలాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దాంతో ఐపీఎల్ ను కివీస్ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
IPL 2023 టోర్నమెంట్ ను ఆది నుంచి గాయాలు వెంబడిస్తూనే ఉన్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే స్టార్ ఆటగాళ్లు అందరు గాయాల కారణంగా తమ తమ ఫ్రాంఛైజీలకు దూరం అయ్యారు. ఇక ఐపీఎల్ ప్రారంభం అయ్యాక తొలి మ్యాచ్ లోనే గుజరాత్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నైతో జరిగిన ఈ మ్యాచ్ లో ఓ సిక్సర్ ను అడ్డుకోబోయిన విలియమ్సన్ మోకాలికి బలమైన గాయం అయ్యింది. దాంతో విలియమ్సన్ పూర్తిగా ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం అయ్యాడు. అయితే ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ న్యూజిలాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దాంతో ఐపీఎల్ ను కివీస్ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
కేన్ విలియమ్సన్.. ప్రపంచ క్రికెట్ లో పరుగులు చేయడంలో.. ఓ స్థిరమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు నుంచి బయటికి వచ్చిన తర్వాత అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపలేదు. చివరికి ఒక కోటి రూపాయలకు గుజరాత్ టైటాన్స్ జట్టు అతడిని చివరి నిమిషంలో కొనుగోలు చేసింది. అయితే.. తొలి మ్యాచ్ లోనే గుజరాత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా విలియమ్సన్ మోకాలికి గాయం అయ్యింది. దాంతో అతడు పూర్తిగా ఐపీఎల్ కు దూరం అయ్యాడు. ఇక గాయం పెద్దది కావడంతో.. అతడి కాలుకు సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక సర్జరీ అనంతరం కేన్ మావ న్యూజిలాండ్ పయణం అయ్యాడు.
ఈ క్రమంలోనే కివీస్ ఎయిర్ పోర్ట్ లో రెండు స్టిక్స్ సహాయంతో.. కాలుకు బ్యాండెజ్ వేసుకుని కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దాంతో విలియమ్సన్ ను అలా చూసి కివీస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే కేన్ మావకు అయిన గాయం చూస్తుంటే అతడికి ఎక్కువ రోజులు విశ్రాంతి అవసరం అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం కివీస్ క్రికెట్ ఫ్యాన్స్ లో ఆందోళన పరుస్తోంది. వచ్చే వరల్డ్ కప్ కు కేన్ మావ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కివీస్ జట్టులో కేన్ మావ కీలక ఆటగాడు.. అతడు కానీ వరల్డ్ కప్ కు దూరం అయితే న్యూజిలాండ్ కు కష్టాలే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. దాంతో ఐపీఎల్ పై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు కివీస్ ఫ్యాన్స్. మరి కివీస్ ఫ్యాన్స్ ఐపీఎల్ ను తిట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH: Hear Kiwi cricketer Kane Williamson’s first comments as he touches down in NZ, after a knee injury cut short his @IPL campaign https://t.co/j8QZegWvcu (Via @AlexChapmanNZ) pic.twitter.com/5GUnkugHXa
— Newshub (@NewshubNZ) April 3, 2023