విరాట్ కోహ్లీని కలవడానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. కానీ ఈ విషయంలో పాంటింగ్ కొడుకు లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. ఆ వివరాలు తెలియాలంటే..
ఐపీఎల్ 16వ సీజన్ థ్రిల్లింగ్ మ్యాచ్ లతో అభిమానులని అలరిస్తూ వస్తుంది. గత నాలుగు రోజులుగా మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న మ్యాచ్ లు మరింత ఆసక్తికరంగా మారే అవకాశముంది. వీకెండ్ కావడంతో డబుల్ కిక్ ఇచ్చేనందుకు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం జరగబోయే మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో తలబడాల్సి ఉంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యం ఇస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలిసి సందడి చేసాడు. పాంటింగ్ తన కొడుకును కోహ్లీకి పరిచయం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కడున్నా.. ఏం చేసినా విశేషమే. కింగ్ గ్రౌండ్ లోనే కాదు బయట ఎక్కడున్నా కెమెరా కనిపెట్టుకోని ఉంటుంది. ఈ క్రమంలో పాంటింగ్.. విరాట్ కోహ్లీని కలిసి సర్ప్రైజ్ చేసాడు. ఢిల్లీ జట్టుకి కోచ్ గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. కోహ్లీని కలవడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. అతని కొడుకు కోహ్లీని చూసి సిగ్గు పడడం నవ్వు తెప్పించింది. కోహ్లీ పరిచయం చేసుకుంటుండగా..ఈ పిల్లాడు సిగ్గు పడుతూ తల దాచుకున్నాడు. చాలా సరదాగా సాగిన ఈ వీడియో ముచ్చట గొలిపేలా ఉంది. ఇది చూసిన అభిమానులు ఆ పిల్లాడు బహుశా కోహ్లీ ఫ్యాన్ అనుకుంటా. అందుకే కళ్ళల్లో చూస్తూ దైర్యంగా మాట్లాడలేకపోయాడు అని కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత కోహ్లీ పాంటింగ్ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ వీడియోని ఢిల్లీ జట్టు ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది.
ఇక ఇరుజట్ల మధ్య శనివారం మధ్యాహ్నం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైన ఢిల్లీ.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని భావిస్తుంది. మరోవైపు సొంత గడ్డపై ఆడనుండడం ఆర్సీబీ కి కలిసి రానుంది. ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ మంచి ఫామ్ లో ఉండడంతో బెంగళూరు అభిమానులు విజయంపై ధీమాగా ఉన్నారు. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. మ్యాచ్ సంగతి అలా ఉంచితే.. పాంటింగ్ కొడుకు విరాట్ కోహ్లీ ని చూసి సిగ్గుపడడం హైలెట్ గా అనిపించింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Jab Ricky Met Kohli 🥺
Extended Cameo: Ricky Jr 👶🏻#YehHaiNayiDilli #IPL2023 #ViratKohli #KingKohli #RCBvDC | @imVkohli | @RickyPonting pic.twitter.com/0LegGmLtga— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2023