ముంబయిపై గుజరాత్ గెలిచింది. ఇప్పుడు ఇది కాకుండా మరో విషయం హాట్ టాపిక్ అయింది. గిల్-సచిన్ కలిసి మాట్లాడుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ కి కారణమైంది.
శుభ్‌మన్ గిల్.. టీమిండియా నెక్స్ట్ రన్‌మెషీన్. కోహ్లీ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు సమాధానంలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న గిల్.. వరస సెంచరీలు చేస్తూ కేక పుట్టిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుని కోహ్లీ రికార్డ్ కే ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు. క్లాస్ టెక్నిక్ తో ఆడుతున్నప్పటికీ బాదుడు మాత్రం అస్సలు ఆపట్లేదు. ముంబయి జట్టు కూడా గిల్ దెబ్బకు తాజాగా బలైపోయింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గిల్ తో సచిన్ సీరియస్ డిస్కషన్ పెట్టడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొచ్చేస్తే.. గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్తోంది. గతేడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ సీజనే కప్ కొట్టేసిన ఈ జట్టు.. ప్రస్తుత సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. ఈసారి కూడా ఫైనల్ లో అడుగుపెట్టేసింది. తాజాగా క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబయిపై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గిల్ చేసిన సెంచరీ అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. మ్యాచ్ తర్వాత ఇప్పుడు సెంచరీ విషయమై సచిన్, గిల్ తో చాలాసేపు మాట్లాడాడు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ గా మారిపోయింది.
సచిన్ తో గిల్ సెంచరీ గురించే మాట్లాడి ఉంటారని అనుకుంటున్నారు. కొందరు నెటిజన్స్ మాత్రం ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సచిన్ కూతురు సారా టెండూల్కర్ ని సీన్ లోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో సారా-గిల్ ప్రేమించుకున్నారని టాక్ వినిపించింది. ఐపీఎల్ ముంబయి-గుజరాత్ మ్యాచ్ జరుగుతుంటే జట్ల గురించి మానేసి గిల్-సారా గురించి టాపిక్ వస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా సచిన్, గిల్ తో డిస్కషన్ పెట్టేసరికి అల్లుడిగా మామ టిప్స్ ఇస్తున్నాడ్రోయ్ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఫొటో చూడగానే మీకు మైండ్ లో ఫస్ట్ ఏమనిపించింది? కింద కామెంట్ చేయండి.
Shubman Gill with Sachin Tendulkar. pic.twitter.com/Tk5Y2aImE4
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2023