విలియమ్సన్ గాయపడటం అతడికి ప్లస్ అయింది. ఎందుకంటే వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం గుజరాత్ జట్టులో ఆడే సూపర్ ఛాన్స్ కొట్టేశాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్?
గుజరాత్ టైటాన్స్ కు తొలి మ్యాచులోనే షాక్ తగింది. ఫీల్డింగ్ చేస్తూ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. తాజాగా అతడు స్టిక్స్ ఆధారంగా నడుస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇవి చూసి ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. అటు గుజరాత్ ఫ్యాన్స్ తోపాటు హైదరాబాద్ జట్టు అభిమానులు కూడా అయ్యో అనుకున్నారు. ఇప్పుడు అతడి స్థానంలో కొత్త ప్లేయర్ ని గుజరాత్ తీసుకుంది. తొలుత వేలంలో అసలు అమ్ముడుపోని ఆ ప్లేయర్.. ఇప్పుడు ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ లోనే మెంబర్ అయిపోయాడు. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ని ఈసారి గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ కు సొంతం చేసుకుంది. దీంతో కేన్ మావ మెరుపులు ఈసారి చూడబోతున్నాం అని క్రికెట్ ప్రేమికులు ఫిక్సయిపోయారు. కానీ తొలి మ్యాచులోనే అతడు గాయపడం అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు అతడి స్థానంలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనకని తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి తాజాగా ట్వీట్ కూడా చేసింది. విలియమ్సన్ బ్యాటర్ కాగా.. షనక ఆల్ రౌండర్ అవడం విశేషం.
విధ్వంసక బ్యాటింగ్ తోపాటు పేస్ బౌలింగ్ తోనూ రెచ్చిపోయే షనకని రూ.50 లక్షల కనీస ధరకు గుజరాత్ దక్కించుకుంది. కొన్ని నెలల క్రితం జరిగిన వేలంలో ఇతడిని ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు విలియమ్సన్ గాయపడటం.. ఇతడికి కలిసొచ్చింది. ఇప్పటికే గుజరాత్ టీమ్ లో చాలామంది ఆల్ రౌండర్స్ ఉన్నారు. ఇతడికి చోటు దక్కి, ఆకట్టుకునే ప్రదర్శన చేస్తే మాత్రం ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. మరి చూడాలి షనక ఏం అద్భుతాలు చేస్తాడో? మరి విలియమ్సన్ ప్లేసులో గుజరాత్ జట్టు లంక కెప్టెన్ షనకని తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#TitansFAM, the announcement you’ve been waiting for!
Sri Lankan all-rounder Dasun Shanaka will be replacing Kane Williamson for #TATAIPL 2023. Let’s give our new Titan a 𝙎𝙝𝙖𝙣𝙙𝙖𝙖𝙧 𝙎𝙬𝙖𝙖𝙜𝙖𝙩 in the comments! 💙#AavaDe | @dasunshanaka1 pic.twitter.com/2wFxNRZb58
— Gujarat Titans (@gujarat_titans) April 5, 2023