సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్ది ఏ ఆటగాడిలోనైనా పస తగ్గుతుంది. అయితే ఇందుకు మినహాయింపుగా నిలుస్తున్నాడు తెలుగు తేజం అంబటి రాయుడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన షాట్స్ తో తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు.
సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్ది ఏ ఆటగాడిలోనైనా పస తగ్గుతుంది. ఇది సహజమే. అయితే చాలా కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలుస్తారు. అందులో తెలుగు తేజం అంబటి రాయుడు ఒకడు. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాయుడు.. ఐపీఎల్ లో మాత్రం సత్తా చాటుతూనే ఉన్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత అందరు రాయుడు పని అయిపోయింది అనుకున్నారు. కానీ తాజాగా ఐపీఎల్ 2023లో లక్నోతో జరిగిన మ్యాచ్ లో తన అద్భుతమైన షాట్స్ తో.. తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. ఈ మ్యాచ్ లో చేసింది తక్కువ పరుగులే అయినప్పటికీ అతడు కొట్టిన షాట్స్ ఆకట్టుకున్నాయి.
అంబటి రాయుడు.. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత అతడి పని అయిపోయింది అనుకున్నారు. ఇలా అనుకున్న ప్రతిసారి తనలో ఉన్న బ్యాటర్ తోనే సమాధానం ఇస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై తరుపునే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 14 బంతులు ఎదుర్కొన్న రాయుడు 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే అతడు చేసింది 27 పరుగులే కావొచ్చు. కానీ అతడు బ్యాటింగ్ చేసిన శైలిని ఇక్కడ గమనించాలి. వయసు మీద పడటం, క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో.. అందరు రాయుడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ తనలో ఇంకా వేడి తగ్గలేదని తాజాగా అతడు ఆడిన షాట్స్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (57), కాన్వే(47), దుబే (27) చివర్లో ధోని 3 బంతుల్లో 2 సిక్స్ లతో 12 పరుగులు చేశాడు.