3D Player Vijay Shankar: విజయ్ శంకర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఏకంగా 4 ఫోర్లు, 5 సిక్సులతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ షాట్లు ఆడతుంది అసలు విజయ్ శంకరేనా? అనే అనుమానం కలిగేలా బ్యాటింగ్ చేశాడు.
2019 నుంచి త్రీడీ ప్లేయర్ అంటూ దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అతను ఆడుతున్న ప్రతిసారి త్రీడీ ప్లేయర్.. త్రీడీ ప్లేయర్ అంటూ పాపం.. ఏ క్రికెటర్‌పై కూడా జరగనంత ట్రోలింగ్ అతనిపై జరిగింది. కానీ.. ఆదివారం మాత్రం తన విశ్వరూపంతో త్రీడీ ప్లేయర్ ట్యాగ్‌ను పాజిటివ్‌గా మార్చేసుకున్నాడు. ఎందుకంటే అతను ఆడిన ఇన్నింగ్స్ అలా ఉంది మరీ. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్-వృద్ధిమాన్ సాహా తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. సాహా 17 రన్స్ చేసిన అవుటైన తర్వాత.. గిల్, సాయి సుదర్శన మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పారు. 100 పరుగుల వద్ద గిల్ రూపంలో గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అభినవ్ మనోహర్ మూడు చక్కటి ఫోర్లతో టచ్‌లో కనిపించినా.. 14 పరుగులకే అవుట్ అయ్యాడు.
118 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఇంకో 39 బంతులు మిగిలి ఉండగా క్రీజ్‌లోకి త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. విజయ్ శంకర్‌పై ఎవరీ పెద్దగా అంచనాలు లేవు. సాయి సుదర్శన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇక హిట్టింగ్ చేసి ఒక వికెట్ పడితే.. మిల్లర్ వచ్చి చివర్లో రన్స్ చేస్తారని అంతా భావించారు. కానీ.. విజయ్ శంకర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఏకంగా 4 ఫోర్లు, 5 సిక్సులతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ షాట్లు ఆడతుంది అసలు విజయ్ శంకరేనా? అనే అనుమానం కలిగేలా బ్యాటింగ్ చేశాడు. అతను ఆడుతుంటే.. ఇంతకాలం ఇతన్నేనా త్రీడీ ప్లేయర్ అంటూ ట్రోల్ చేసిందనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో కలిగింది. మరి ఇంత ఆటను ఇంతకాలం ఎక్కడపెట్టుకున్నావ్ అంటూ ప్రశంసతో కూడిన చురకలు సైతం విజయ్ శంకర్‌కు పడుతున్నాయి.
కేవలం 24 బంతులను ఎదుర్కొన్న విజయ్ శంకర్ 4 ఫోర్లు, 5 సిక్సులతో 63 పరుగులు చేసి అదరగొట్టాడు. 160, 170 వరకు వెళ్తుందనుకున్న గుజరాత్ స్కోర్.. విజయ్ శంకర్ పవర్ హిట్టింగ్‌తో ఏకంగా 200 మార్క్ దాటింది. మొత్తం మీద విజయ్ శంకర్ షోతో గుజరాత్ 204 పరుగుల చేసింది. అయితే.. విజయ్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్ అనే పేరు ఎందుకొచ్చిందో చాలా మందికి తెలిసే ఉంటుంది. 2019 వన్డే వరల్డ్ కప్ రాయుడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు అతను తీ డైమెన్షన్ ఆటగాడని, త్రీ డైమెన్షన్లలో చూసి ప్లేయర్‌ను ఎంపిక చేయసినట్లు పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కని అంబటి రాయుడు.. తన కోపాన్ని సెలెక్టర్లపై ప్రదర్శిస్తూ.. త్రీ డైమెన్షన్ ఆట చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు ఆర్డర్ పెట్టానంటూ ట్వీట్ చేసి.. వివాదానికి తెరతీశాడు. అప్పట్లో రాయుడు ట్వీట్ పెను దుమారమే రేపింది. అయితే.. వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్ దారుణంగా విఫలం కావడంతో.. ఇదేనా త్రీడీ ఆట అంటూ సెలెక్టర్లతో పాటు విజయ్ శంకర్‌పై సైతం క్రికెట్ అభిమానులు రాయుడికి మద్దతుగా ట్రోలింగ్‌కు దిగారు. అప్పటి నుంచి విజయ్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్ అనే ముద్ర పడింది. కానీ.. కేకేఆర్‌పై అతను ఆడిన విధానం చూసి.. ఇప్పుడు మాత్రం రాయుడి కంటే బెటర్‌గా ఆడాడంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విజయ్ శంకర్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vijay Shankar smashed 41* runs in the last 11 balls in 19th & 20th over. pic.twitter.com/Eg6vvodnSK
— Johns. (@CricCrazyJohns) April 9, 2023