‘ఐపీఎల్ 2022’ సీజన్ కు సంబంధించి అన్ని పనులను బీసీసీఐ చకాచకా చేస్తోంది. ఇప్పిటికే అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్టును కూడా వెల్లడించాయి. ఇంక మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబరులోనే మెగా ఆక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ విషయంలో తెలుగు అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే వార్నర్ ను వదిలేశారని కారాలు మిరాయాలు నూరుతుంటే.. రషీద్ ఖాన్ లేకపోవడంతో ఆ కోపం ఇంకాస్త ఎక్కువైంది. హైదరాబాద్ టీమ్ యాజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రషీద్ ఖాన్ ను ఎందుకు రిటైన్ చేసుకోలేదు? యాజమాన్యం వద్దందా? రషీద్ జట్టులోకి రానన్నాడా? ఆ విషయంలో తప్పు ఎవరిది? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేద్దాం.
ఐపీఎల్ 2022 సీజన్ లో రెండు కొత్త జట్లు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి రిటైన్ రూల్స్ మారిన మాట కూడా వాస్తవమే. ఏ జట్టైనా గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోగలదు. వారిలో గరిష్ఠంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు. హైదరాబాద్ టీమ్ ముందుగా కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ ను రిటైన్ చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. కేన్ విలియమ్సన్ కు రూ.14 కోట్లు, రషీద్ కు రూ.12 కోట్లు ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైపోయింది. అయితే నేను వేలానికి వెళ్తా అంటూ.. రషీద్ ఖాన్ యాజమాన్యానికి షాక్ ఇచ్చాడు. మీరు ఇచ్చే ప్రైస్ నాకు సరిపోదు వేలానికి వెళ్తే అంతకన్నా ఎక్కువే వస్తుందనేనది రషీద్ వాదన. తొలి రిటైన్ ప్లేయర్ గా తీసుకుని రూ.16 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. నూతన రిటైన్ రూల్స్ ప్రకారం ప్లేయర్ వేలానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే.. ఫ్రాంచైజీ అడ్డు చెప్పడానికి ఆస్కారం లేదు.
కొత్తగా వచ్చిన లక్నో జట్టుపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. తమ రిటైన్ ప్లేయర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ.. హైదరాబాద్, పంజాబ్ జట్లు బీసీసీఐ వద్ద ఆరోపణలు చేశాయి. రషీద్ ఖాన్ కు లక్నో రూ.16 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిచింది. అందుకే రషీద్ ఖాన్ అదే అమౌంట్ ఇస్తేనే జట్టుతో కొనసాగుతాను.. లేదంటే నాదారి నేను చూసుకుంటా అని తేల్చిచెప్పినట్లు సమాచారం. చేసేది లేక రషీద్ ఖాన్ ను హైదరాబాద్ రిటైన్ చేసుకోలేక పోయిందని తెలుస్తోంది. ఈ విషయంలో హైదరాబాద్ జట్టు యాజమాన్యం తప్పేమీ లేదని.. రషీద్ ఖాన్ జట్టు వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కానీ, ముందు వార్నర్, తర్వాత రషీద్ ఖాన్ జట్టును వీడుతుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ టీమ్ ను విమర్శించడం మొదలు పెట్టారు. రషీద్ ఖాన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Presenting the 2️⃣ #Risers along with Captain Kane who will continue to don the #SRH colours in #IPL2022 🧡
We enter the auction with a purse of INR 68 crores. #OrangeArmy pic.twitter.com/2WwRZMUelO
— SunRisers Hyderabad (@SunRisers) November 30, 2021