ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలం అయింది. 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 గెలుపుతో దాదాపు ప్లేఆఫ్స్‌కు దూరమైంది. టోర్నీ ఆరంభానికి ముందు తమ కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను నియమించిన CSK మేనేజ్‌మెంట్.. ఆ తర్వాత మళ్లీ ధోనికి కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. తన కెప్టెన్సీలో జట్టు విఫలం కావడంతో పాటు తన ఆట కూడా దెబ్బ తినడంతో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకుని ధోనికే పగ్గాలు ఇచ్చాడు. కాగా.. CSK వైఫల్యానికి కారణాలపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో జడేజాను తమ కెప్టెన్‌గా నియమించాలని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్న నిర్ణయం అతి పెద్ద తప్పు అని పేర్కొన్నాడు.
సీజన్ ప్రారంభం నుంచి ధోనీ కెప్టెన్‌గా ఉండి ఉంటే చెన్నై జట్టు కథ వేరేలా ఉండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. CSK వైఫల్యానికి బ్యాటర్ల పేలవమైన ఫామ్ ఓ ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘స్థిరమైన ప్లేయింగ్ ఎలెవన్ లేదని, రుతురాజ్ గైక్వాడ్ సీజన్ ప్రారంభంలో పరుగులు చేయకుండా.. చాలా పేలవంగా టోర్నీని ప్రారంభించాడని వెల్లడించాడు. బ్యాటర్లు అంతగా రాణించలేదని, సీజన్లో మొత్తం CSK పరిస్థితి గందరగోళంగా తయారైందన్నాడు. మొదటి నుంచి ధోనీ గనుక కెప్టెన్‌గా ఉండుంటే బాగుండేదన్నాడు. CSK ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయేదే కాదని వెల్లడించాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో ధోనీ ఔట్ అవ్వడం మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్ అని సెహ్వాగ్ చెప్పాడు. మరి సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీ, రోహిత్ సరిగ్గా ఆడటం లేదు! రెస్ట్ తీసుకోవడం బెటర్: ఎంఎస్కే ప్రసాద్
Former India batter Virender Sehwag has said that it was a wrong decision to appoint Ravindra Jadeja as the captain of CSK#IPL2022 #MSDhoni https://t.co/ZBKRWECEaK
— CricketNDTV (@CricketNDTV) May 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.