‘ఐపీఎల్ 2022’కి రంగం సిద్ధమైంది. మెగా వేలానికి తేదీ కూడా ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ 15 మెగా ఆక్షన్ జరగనుంది. ఇదిలా ఉండగా SRH యాజమాన్యం వేగంగా పావులు కదుపుతోంది. గత సీజన్ తో మూటగట్టుకున్న అప్రతిష్టను తుడిచివేయడమే లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వేలానికి ముందు టీమ్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోచ్ లు, సిబ్బంది మొత్తాన్ని నియమించారు. అఫీషియల్ గా కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్ ను అభిమానులకు పరిచయం చేశారు. లిస్టు చూస్తే మాములుగా లేదు. ఇదంతా కావ్య పాప స్ట్రాటజీ అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Introducing the new management/support staff of SRH for #IPL2022!
Orange Army, we are #ReadyToRise! 🧡@BrianLara #MuttiahMuralitharan @TomMoodyCricket @DaleSteyn62 #SimonKatich @hemangkbadani pic.twitter.com/Yhk17v5tb5
— SunRisers Hyderabad (@SunRisers) December 23, 2021
ఇంట్రడ్యూసింగ్ ‘SRH థింక్ ట్యాంక్’ అంటూ వీడియో ఒకటి పోస్టు చేశారు. ఫీల్డింగ్ కోచ్- స్కౌట్ గా హేమంగ్ బదానీని నియమించారు. అసిస్టెంట్ కోచ్ గా సైమన్ కేటిచ్, పేస్ బౌలింగ్ కోచ్ గా డేల్ స్టెయిన్, హెడ్ కోచ్ గా టామ్ మూడీ, స్ట్రాటజీ- స్పిన్ కోచ్ గా ముత్తయ్య మురళీ ధరన్, స్ట్రాటజిక్ అడ్వైజర్- బ్యాటింగ్ కోచ్ గా బ్రెయిన్ లారాను నియమించారు. ఈ లిస్టు చూస్తుంటే ఈసారి కప్పు మనదే అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంబరాలు షురూ చేశారు. SRH ఐపీఎల్ 2022 టైటిల్ విన్నర్ కాగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#OrangeArmy = best fans in the world 🧡🤩#F1 pic.twitter.com/ebDpTiaJPL
— SunRisers Hyderabad (@SunRisers) December 12, 2021