ఐపీఎల్ 2022 సీజన్ లో అనుకున్నవి, అనుకోనివి చాలా జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. గురువారం హైదరాబాద్- ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీని కట్టడి చేయడంలో విఫలమైంది. నటరాజన్ మ్యాచ్ లో లేని లోటు స్పష్టంగా తెలిసింది. ఆరుగురు బౌలర్లను ప్రయత్నించినా కూడా వికెట్స్ పై ప్రభావం చూపలేకపోయారు. వార్నర్ బీభత్సానికి బ్రేకులు వేయలేకపోయారు. 58 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి పోవెల్ తోడవడంతో హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే కేన్ మామ చేసిన ఒకే ఒక తప్పు హైదరాబాద్ టీమ్ ఓటమికి కారణం అయ్యింది.
ఇదీ చదవండి: చరిత్ర తిరగరాసి.. తన మాటను నిలబెట్టుకున్న ఉమ్రాన్ మాలిక్
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో బ్యాటింగ్ చేసింది.. రన్స్ స్కోర్ చేసింది కేవలం ఇద్దరు బ్యాట్స్ మెన్ మాత్రమే. ఒకటి వార్నర్, రెండు రోవ్మన్ పోవెల్. వార్నర్ ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. అయితే పోవెల్ మాత్రం మొదట ఒక ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా మన కెప్టెన్ కేన్ మామకు. ఆ ఛాన్స్ ని వినియోగించుకోలేకపోవడమే జట్టు ఓటమికి దారి తీసింది. రోవ్మన్ పోవెల్ బ్యాటింగ్ చేస్తుండగా 18 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చాడు. స్ట్రైట్ గా కేన్ చేతిలోకి వెళ్లింది బాల్. కానీ, కేన్ మామ ఆ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత పోవెల్ విజృంభించి 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Kane mama enti idi.. aa catch padite win ayye ballam kada pic.twitter.com/bBR5iPDtbE
— tiru (@tiru9676) May 6, 2022
హైదరాబాద్ టీమ్ ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే కేన్ విలియమ్సన్ ఆ క్యాచ్ పట్టుంటే పోవెల్ నుంచి 49 పరుగులు రాకుండా ఉండేవి. వికెట్ పడిన తర్వాత కాసేపు డిఫెండ్ చేసుకునే వారు కాబట్టి అంత స్కోర్ వచ్చేది కాదు. అటు బ్యాటింగ్ పరంగానూ కేన్ విఫలమయ్యాడు. 20 ఓవర్లలో 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తర్వాత చాలా డిఫెండింగ్ మోడ్ లో కనిపించాడు. పవర్ ప్లేలో పరుగులు చేయలేకపోయారు. కేన్ హిట్టింగ్ స్టార్ట్ చేయగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కూడా వికెట్లు పడుతూనే ఉన్నాయి. కేన్ మామ ఆ క్యాచ్ పట్టుంటే హైదరాబాద్ మ్యాచ్ గెలిచేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలు పెట్టేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కేన్ మామ కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rovman Powell backs up his words with action #DCvSRH | #IPL2022
👉 https://t.co/Vidcs0YMst pic.twitter.com/4ISpz8Lazd
— ESPNcricinfo (@ESPNcricinfo) May 5, 2022