ఐపీఎల్ 2022 విజేత ఎవరో తేలేందుకు ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఈ సీజన్‌తోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌తో ఐపీఎల్ ఆవిర్భావ విజేత రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనుంది. ఆదివారం అహ్మాదాబాద్‌లో ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్ ఆసాంతం తన సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఒంటి చేత్తో రాజస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో అద్భుతమైన శతకం కొట్టి సింగిల్ హ్యాండ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీ బట్లర్‌కు ఈ సీజన్‌లో నాలుగో సెంచరీ. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా కోహ్లీతో బట్లర్ సమంగా నిలిచాడు. 2016 సీజన్‌లో కోహ్లీ కూడా నాలుగు సెంచరీలు సాధించాడు. ఫైనల్‌లో కూడా బట్లర్ సెంచరీ కొడితే.. కోహ్లీ అత్యధిక సెంచరీల రికార్డును బట్లర్ బ్రేక్ చేస్తాడు. ఈ రికార్డ్ అయితే బద్దలు అయ్యే అవకాశం ఉండొచ్చు కానీ.. బట్లర్ ఫైనల్‌లో కూడా సెంచరీ చేసినా కోహ్లీ సృష్టించిన ఒక అద్భుతమైన రికార్డును బట్లర్ టచ్ కూడా చేయలేడని కోహ్లీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బట్లర్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం ఈ సీజన్‌లో బట్లర్ ఇప్పటి వరకు చేసిన 58.86 సగటుతో 823 పరుగులు చేశాడు. 2016 ఐపీఎల్‌లో కోహ్లీ 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో బట్లర్ ఫైనల్‌లో వంద కొట్టినా విరాట్ కోహ్లీ 973 పరుగుల రికార్డును బ్రేక్ చేయలేడని కోహ్లీ అభిమానులు గట్టిగా చెబుతున్నారు.కోహ్లీ రికార్డును బట్లర్ బ్రేక్ చేయాలంటే.. ఇంకా 151 పరుగులు చేయాలి. అలాగే సెంచరీల రికార్డును బ్రేక్ చేసినా.. యావరేజ్‌లో, హాఫ్ సెంచరీలో మాత్రం కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ లేదని కాలర్ ఎగరేస్తున్నారు. కాగా క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమితో ఆర్సీబీ అభిమానులతో పాటు కోహ్లీ అభిమానులు కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ సారి ఎలాగైన కప్ కొడుతుందని ఆశలు పెట్టుకున్నారు. అందుకే తగ్గట్లే ఎలిమినేటర్‌లో సూపర్ ప్రదర్శనతో పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. కానీ.. క్వాలిఫైయర్ 2లో మాత్రం ఫేలవమైన బ్యాటింగ్‌తో ఓడి ఈ ఏడాది కూడా వట్టిచేతులతోనే ఇంటిబాట పట్టింది. మరి కోహ్లీ రికార్డును బట్లర్ బ్రేక్ చేస్తాడా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jos Buttler: ఐపీఎల్ లో బట్లర్ వీర బాదుడుకి కారణం ఈ అమ్మాయే! ఈమె ఎవరంటే?
Most 100s in an IPL season:
Virat Kohli – 4 (2016)
Jos Buttler – 4* (2022)📸: IPL/ BCCI pic.twitter.com/nPQscsx9v6
— CricTracker (@Cricketracker) May 27, 2022