టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఒక సీజన్‌లో 4 సెంచరీలతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరుడు విరాట్ కోహ్లీ. ఇలాంటి అద్భుతమైన రికార్డులు ఉన్న కోహ్లీ.. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. ఎంతలా అంటే.. వరుసగా రెండు మ్యాచ్‌లలో గోల్డెన్ డక్ అయ్యాడంటేనే అర్థం అవుతుంది కోహ్లీ ఎంతటి బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడో. ఈ సీజన్‌లో తొలి 8 మ్యాచ్‌లలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చాడు. అయినా కూడా కోహ్లీ ఫామ్ అందుకోలేకపోయాడు.
ఒక్క బౌండరీ మాత్రమే కాన్ఫిడెన్స్‌గా కొట్టిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కూడా డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి కొద్దిలో బతికిపోయాడు. మొత్తం 10 బంతులాడిన కోహ్లీ కేవలం 9 పరుగులు చేసి తన పూర్ ఫామ్‌ను కొనసాగించాడు. గతంలో కోహ్లీపై కెప్టెన్సీ ఒత్తిడి ఉందనే ఒక వాదన ఉండేది. కానీ ఇప్పుడు తను కెప్టెన్ కాదు కాబట్టి ఆ ఒత్తిడి కూడా లేదు. అయినా కూడా బ్యాటర్‌గా విఫలం అవుతున్నాడు. కానీ.. వరుస మ్యాచ్‌లతో కోహ్లీపై అధిక శ్రమ ఒత్తిడి ఉందని.. అతనికి కొంత విరామం అవసరమని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. రాజస్థాన్‌తో మ్యాచ్ తర్వాత ఇదే విషయంపై కోహ్లీతో పాటు.. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే కోహ్లీ.. ఫామ్ లేకుండా మ్యాచ్ దూరం అవ్వడం ఐపీఎల్ చరిత్రలోనే తొలి సారి అవుతుంది. కాగా కోహ్లీ కూడా.. రాబోయే టీ20 వరల్డ్ సమయానికి తిరిగి ఫామ్ పుంజుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఐపీఎల్‌లో రెస్ట్ తీసుకుని అయినా సరే.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. దీంతో అతను జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ.. ఈ విషయంలో కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం నిరాశగా ఉన్నారు. కోహ్లీ.. ఆటతోనే తన ఫెల్యూయిర్స్‌కు సమాధాన చెప్తాడని వారు భావిస్తున్నారు. మరి కోహ్లీ.. జట్టు నుంచి తప్పుకుంటాడా..? లేక తర్వాతి మ్యాచ్‌లోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPLలో తేలిపోతున్న ఇండియన్ స్టార్ ప్లేయర్స్! టీ20 వరల్డ్ కప్ సాధ్యమేనా?
What advice would you give to Virat Kohli right now?#IPL2022 #RCBvRR pic.twitter.com/O64zBMPyv5
— ESPNcricinfo (@ESPNcricinfo) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.