ఐపీఎల్ 2022లో భాగంగా 31వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. 6 మ్యాచ్‌లలో నాలుగేసి గెలుపులతో పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానంలో, ఆర్సీబీ 4వ స్థానంలో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే ఒక సారి వారి బలాబలాలు పరిశీలిద్దాం..
లక్నో సూపర్ జెయింట్స్..ఈ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గత మ్యాచ్‌లో సెంచరీతో సూపర్ టచ్‌లో ఉన్నాడు. అతనికి తోడు మిగతా బ్యాటర్లు రాణిస్తే.. లక్నో మంచి స్కోర్ చేయగలదు. క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, స్టోయినీస్, బదోనితో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. అలాగే బౌలింగ్‌లో కూడా లక్నో చాలా పటిష్టంగా ఉంది. ఆవేశ్ ఖాన్, చమీరా, జెసన్ హోల్డర్ ముగ్గురూ వికెట్ టేకింగ్ బౌలర్లే. అలాగే రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యాతో స్పిన్ విభాగం కూడా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు. బ్యాటింగ్‌లో కాస్త నిలకడ లేకపోవడం లక్నోకు ఉన్న ప్రధాన లోపం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతుల్యంతో ఉంది. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, కింగ్ కోహ్లీ ఫామ్ పుంజుకోవడంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. ఓపెనర్లు డుప్లెసిస్, అనుజ్ రావత్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో సిరాజ్ కొంత నిరాశ పరుస్తుండడం మైనస్. హసరంగా సూపర్ బౌలింగ్‌తో ఇతర బౌలర్ల వైఫల్యం కనిపించడంలేదు. ఇదే ప్రతి మ్యాచ్‌లో జరుగుతుందని చెప్పలేం. బౌలింగ్‌లో హసరంగాపైనే ఎక్కువగా ఆధారపడుతుండడం మైనస్. ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ ఆడే అవకాశం ఉంది. ఒక ఆర్సీబీ ప్రధాన బలం దినేష్ కార్తీక్ డెత్ ఓవర్లలో సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
పిచ్..
ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరుజట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్సీబీ ప్లేయర్లు ఒక్కరొక్కరుగా ఫామ్‌లో రావడం.. బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ ఉండడంతో ఆర్సీబీకి ఐదో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఆర్సీబీ బ్యాటర్లు వాళ్ల స్థాయి తగ్గట్లు ఆడితే విజయం నల్లేరుపై నడకే.
తుదిజట్ల అంచనా..
ఆర్సీబీ.. డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హసరంగా, హర్షల్ పటేల్, హెజల్‌వుడ్, సిరాజ్, ఆకాశ్ దీప్.
లక్నో.. కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, జెసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్.
ఇదీ చదవండి: IPL ఫిక్సింగ్ అనే వారికి ఇదే సమాధానం!
Game Day mood: Focused. 😎
Have a great Tuesday, 12th Man Army! 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB pic.twitter.com/x0JbkgqyYC
— Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.