మేము మనసు పెట్టి ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించగలమని ఆర్సీబీ మరోమారు నిరూపించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ చెన్నై సూపర్ కింగ్స్‌కు చెక్ పెట్టింది. హ్యాట్రిక్ ఓటములకు ఫుల్‌స్టాప్ పెడుతూ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకొని.. ప్లే ఆప్స్ రేసులో నిలిచింది. బ్యాటింగ్‌లో తడబడినా.. బౌలర్ల ప్రతిభతో అద్భుత విజయాన్ని అందుకుంది.ఎంసీఏ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. లీగ్‌లో రెండు మేటి జట్ల మధ్య పోరు ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్ అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లీ 30(33), డుప్లెసిస్ 38(22) పరుగులతో శుభారంభం అందించగా.. మహిపాల్ లామ్రోర్ (27 బంతుల్లో 42, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్‌లో దినేష్ కార్తీక్ రెండు సిక్సర్లతో 170 మార్క్ దాటించాడు. చెన్నై బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ రెండు, ప్రిటోరియస్ ఒక వికెట్ తీసుకున్నారు.
#IPL2022 #RCBvCSK #RCBvsCSK #CSKvRCB #CSKvsRCB @RCBTweets beat @ChennaiIPL to end three-game losing streak 🏏
IN PICS 📸👉 https://t.co/QZoWd78rO9 pic.twitter.com/2Wavq7vdWz
— TOI Sports (@toisports) May 5, 2022
ఇది కూడా చదవండి: IPL 2022: కోహ్లీ, రోహిత్ ఏం ఆడారని అవకాశాలు ఇస్తున్నారు: అజయ్ జడేజా
అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డెవాన్ కాన్వె (37 బంతుల్లో 56, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలీ (27 బంతుల్లో 34, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. హర్షల్ పటేల్ మూడు వికెట్లతో అదరగొట్టగా, మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీశాడు. ధోనీ సేనను ఓడించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇక.. చెన్నై, ఈ సీజన్‌లో ఆరో ఓటమిని అందుకుని తొమ్మిదో స్థానంలోనే కొనసాగుతోంది.
It’s derby day!!! #RCBvCSK
Alex Vs @katecross16
Enemies until the result 😉 💛❤️ #IPL2022 #RCB #CSK𓃬 pic.twitter.com/iDyPugH3pD
— Alexandra Hartley (@AlexHartley93) May 4, 2022
Proposal during RCB vs CSK match, and that guy said ‘Yes’. And the girl also wore the ring to the boy. pic.twitter.com/zGKfwQnLeS
— CricketMAN2 (@ImTanujSingh) May 4, 2022
RCB jumps to 4th position on the Points Table after win against CSK 🏏
📸: BCCI/IPL#IPL2022 #PointsTable #IPLUpdates #RCBvsCSK #Cricket pic.twitter.com/13lm4SxaeC
— SportsTiger (@sportstigerapp) May 5, 2022