ఐపీఎల్ కప్ కొట్టేది ఎవరంటే.. చాలామంది ముంబయి, చెన్నై జట్ల పేర్లు చెబుతారు. దరిద్రానికి కేరాఫ్ ఎవరూ అంటే తడుముకోకుండా అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ ఆర్సీబీ. మరి ఈ జట్టు దరిద్రం ఎందుకు మారట్లేదు?
ఐపీఎల్ సీజన్లు మారుతున్నాయి గానీ ఆర్సీబీ ఆటతీరు అస్సలు మారడం లేదు. గుజరాత్ లాంటి కొత్త జట్లు, ఎంట్రీ ఇచ్చిన సీజన్ లోనే కప్ కొట్టేస్తున్నాయి. ఆర్సీబీ మాత్రం ఇంకా ప్రేక్షకుల్ని హృదయాల్ని గెలుచుకోవడమే తప్ప కప్ కొట్టడం లేదు. కనీసం ఆ దిశగా అస్సలు ఆలోచిస్తున్నట్లు కనిపించట్లేదు. సరే ఇప్పటివరకు అయిన సీజన్లు, మ్యాచుల్ని పక్కనబెట్టేద్దాం. తాజాగా చెన్నైతో మ్యాచ్ నే తీసుకుందాం. ఆర్సీబీ బ్యాటింగ్ చేసి గెలవడం పక్కా అని అందర ఫిక్స్ అయిపోయారు. అలాంటి జట్టు.. అడ్డంగా ఓడిపోయింది. అసలు గెలిచే ఛాన్స్ లేని మ్యాచ్ ని సీఎస్కే.. 8 పరుగుల తేడాతో చేజిక్కుంచుకుంది. దీంతో ఆర్సీబీ దరిద్రం గురించి మరోసారి డిస్కషన్ మొదలైంది.
ఇక విషయానికొస్తే.. ఐపీఎల్ కొత్త సీజన్ స్టార్ట్ అవుతుందని తెలియగానే దాదాపు ప్రతి జట్టు ఫ్యాన్.. ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటాడు. ‘ఈసాలా కప్ నమదే’ స్లోగన్ కి ఈసారైనా న్యాయం చేస్తారా? కనీసం కప్ కొడతారా అని సైటెర్స్ వేస్తూ మాట్లాడుతాడు. దీంతో ఆర్సీబీ అభిమానులకు మండిపోతుంది. ఎలాగైనా సరే కప్ కొట్టి చూపిస్తాం అని ఛాలెంజ్ లు చేస్తారు. కానీ రియాలిటీలో మాత్రం ఆ జట్టు తీరు అస్సలు మారదు. తొలి కొన్ని మ్యాచులు గెలిచేస్తుంది. కానీ ఆ తర్వాత షరా మామూలే. ‘చోకర్స్’ అనే బిరుదుకు పూర్తి న్యాయం చేస్తూ గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడం.. ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ లో గెలవడం లాంటివి చేస్తూ ఉంటుంది.
చెన్నైతో మ్యాచ్ లోనూ ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఒక్క సిరాజ్ తప్పితే మిగతా అందరూ తలో వికెట్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులిచ్చేశారు. దీంతో సీఎస్కే 226/6 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కోహ్లీ త్వరగా ఔటైనప్పటికీ.. కెప్టెన్ డుప్లెసిస్(62)తో పాటు మ్యాక్స్ వెల్ (76) ధనాధన్ బ్యాటింగ్ చేశారు. కానీ ఏం లాభం.. వీరిద్దరూ ఇలా ఔటయ్యారో లేదో మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది. సీఎస్కే ఫీల్డర్స్ క్యాచ్ లు వదిలేసినప్పటికీ.. బెంగళూరు బ్యాటర్లు దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయారు. అలా ఒకరిద్దరూ బౌలర్లు, టాప్-3 బ్యాటర్లపై ఎప్పుడైతే ఆర్సీబీ ఆధారపడటం మానేస్తుందో అప్పుడో కప్ కొట్టే ఛాన్సులుంటాయి. లేదంటే.. ఫ్యాన్స్ అందరూ ‘ఈసాలా కప్ నమదే’ అనుకోవడమే గానీ కప్ అయితే రాదు! మరి ఆర్సీబీ ఆటతీరుపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
It was a great chase, if we had won it would have been better 😄#IPL2023 #rcb #PlayBold #RCBvsCSK pic.twitter.com/a3IBGCSAVH
— Namma Team RCB Official (@nammateamrcb) April 17, 2023