మార్చి 26న మొదలైన ఐపీఎల్ 2022 సీజన్ క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుండడంతో మండే వేసవిని సైతం ఫాన్స్ సల్లగా ఎంజాయ్ చేస్తున్నారు. లీగ్ మ్యాచులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో రెండు వారాల్లో లీగ్ స్టేజ్ పూర్తవనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే అధికారికంగా 16 పాయింట్లు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. 14 పాయింట్స్ సాధిస్తే.. ఇతర జట్ల సమీకరణలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఏయే జట్లేకు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
లీగ్ మ్యాచులు పూర్తయ్యేసరికి టాప్ 4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తాయి. 10 జట్లలో ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు అద్భుతంగా ఆడుతున్నాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 2లో కొనసాగుతున్నాయి. గుజరాత్ ఆడిన 10 మ్యాచుల్లో 8 విజయాలు అందుకుని 16 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు లక్నో సైతం..10 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంకో విజయం సాధిస్తే.. లక్నోకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే.
This @gujarat_titans Squad is too strong. Wins their 8th match of the Season out of 9. Team full Of match winners, this time It is @rahultewatia02 & @DavidMillerSA12
Gujarat winning matches for fun🤯🔥🔥🔥#GujaratTitans #IPL2022 pic.twitter.com/XUV1BcHeC3
— Thyview (@Thyview) April 30, 2022
Owner to Captain: Well done, KL Rahul!#KLRahul | #LucknowSuperGiants pic.twitter.com/TBLUDqjFn6
— Kunal Yadav (@kunaalyaadav) May 1, 2022
ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే అర్థత సాధించగా.. మిగిలిన 3 స్థానాల కోసం 8 జట్లు పోటీపడుతున్నాయి. లక్నో సైతం ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు 100 శాతం ఉండడంతో.. 2 స్థానాల కోసం తీవ్ర పోటీ ఉండనుంది.
#IPL2022 point table after match between #RCBvCSK pic.twitter.com/ioX2gGka6G
— Doordarshan Sports (@ddsportschannel) May 5, 2022
Five-time champions Mumbai Indians and four-time champions Chennai Super Kings bow out of IPL 2022.
📸: IPL/BCCI pic.twitter.com/bC3xgIrVcf
— CricTracker (@Cricketracker) May 4, 2022