ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్.. ఏకంగా ఐదుసార్లు కప్పు కొట్టిన టీమ్. కానీ ఐపీఎల్ 2022లో మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడింది. ముంబై లాంటి బలమైన టీమ్ నుంచి ఇలాంటి ఆరంభం ఎవరూ ఊహించి ఉండరు. గత ఎనిమిదేళ్లలో ముంబై ఇండియన్స్ వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ.. ఈ వరుస ఓటములు కూడా ముంబైకి ఉన్న ఓ సెంటిమెంట్‌ను రిపీట్ చేసేలా ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు.
2015లో ముంబై ఇండియన్స్ తొలి నాలుగు మ్యాచ్‌లలో ఓడి కూడా ఆ ఏడాది విజేతగా నిలిచింది. ఇదే సెంటిమెంట్ ఈ ఏడాది కూడా పునరావృతం అవుతుందని ఎంఐ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ముంబై ఇండియన్స్ ఇలా వరుసగా మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇది నాలుగో సారి. ఆరంభ సీజన్ 2008లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసిన ముంబై.. ఆ తర్వాత 2014, 2015, 2022లోనూ నాలుగు ఓటములతో టోర్నీని ప్రారంభించింది. 2018లోనూ ఆ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో సీజన్‌ని స్టార్ట్ చేసింది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? 2008, 2014, 2018, 2022 సీజన్ల ఆరంభానికి ముందు ఐపీఎల్ మెగా వేలం జరగగా.. ఈ వేలం తర్వాత ముంబై ఇండియన్స్ తడబడింది. మరి ముంబై కోసం ఫ్యాన్స్ తెరపైకి తెచ్చిన సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రహానే అవుట్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు..!
Mumbai Indians lost their 4th match on the row yesterday.
I believe it’s the perfect time to relive the greatest comeback by a franchise in T20 history.
Yes. Let’s go down the memory lane to the 8th edition of IPL i.e. IPL 2015. (1/15) pic.twitter.com/4qXKXKYRjt
— abracadabra (@ydisskolaveridi) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.