ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతుంది. ఇప్పటికే తొలి ఐదు మ్యాచ్‌లలో ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో ఉంది. అలాగే లక్నో ఐదు మ్యాచ్‌లలో మూడు గెలుపులతో మంచి జోష్‌లో ఉంది. మరి ఈ రెండు జట్ల మధ్య పోరులో ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు వారి బలాబలాలు పరిశీలిద్దాం.
ముంబై ఇండియన్స్..ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. బౌలింగ్‌లో అన్ని జట్ల కంటే వీక్‌గా కనిపిస్తుంది. బుమ్రాను మినహా ఇస్తే.. ముంబై బౌలింగ్ ఎటాక్ చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో మంచి డెప్త్ ఉన్నా.. సూర్యకుమార్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. మిగతా బ్యాటర్లు కూడా రాణించాలి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ఝుళిపిస్తే కానీ.. ముంబైకు భారీ స్కోర్ వచ్చే అవకాశం లేదు. ఇక బౌలింగ్‌లో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం ముంబైకు మైనస్.
లక్నో సూపర్ జెయింట్స్..ఈ సీజన్‌లలో రెండు కొత్త టీమ్స్‌లో ఒకటైన లక్నో ఇప్పటి వరకు మంచి ప్రదర్శన కనబర్చింది. ఓడిన రెండు మ్యాచ్‌లలో కూడా పోరాడి ఓడింది. కాగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి మ్యాచ్‌లో డకౌట్ అవ్వడం కొత్తతో అతనిపై కొంత ఒత్తిడి ఉండొచ్చు. మిగతా బ్యాటర్లు పర్వాలేదనిపిస్తున్నారు. ఆల్‌రౌండర్ జెసన్ హోల్డర్ చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ముంబైతో పొల్చుకుంటే.. లక్నో బౌలింగ్ ఎటాక్ కొంత బలంగా ఉంది.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించే అవకాశం ఉంది. బౌలింగ్ వీక్‌గా ఉన్న ముంబైపై భారీ స్కోర్ చేసి, బౌలర్లు స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. టాస్ ఓడినా విజయం ఖాయం.
తుది జట్ల అంచనా..
ముంబై.. రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, పొలార్డ్, రమన్‌దీప్ సింగ్/అర్జున్ టెండూల్కుర్, మురగన్ అశ్విన్, జైదేవ్ ఉనద్కట్, బుమ్రా, థంపి.
లక్నో.. కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, జెసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్.
New opposition, renewed hope 💙
Start your morning with this preview of #MIvLSG 👇#OneFamily #DilKholKe #MumbaiIndianshttps://t.co/9TJ0eND6fF
— Mumbai Indians (@mipaltan) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.