ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన టీమ్ ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మాత్రం అత్యంత దారుణంగా టోర్నీని ఆరంభించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు (ఐదు) ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022లో వరుసగా ఐదో మ్యాచ్‌లో కూడా ఓడింది. దీంతో ముంబై ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతకుముందు 2014 సీజన్‌లోనూ తొలి ఐదు మ్యాచ్‌లోను ముంబై ఓటమి పాలైంది. ఇలా ఐపీఎల్‌లో రెండు సార్లు తొలి ఐదు మ్యాచ్‌లలో ఓడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ దారుణమైన రికార్డును మూటగట్టుకుంది.
ఈ సీజన్‌లో బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పరాజాయం పాలైంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 186 పరుగుల మాత్రమే చేయగలిగింది. బ్రేవిస్(49), సుర్యకుమార్ యాదవ్(43) అద్భుత ఇన్నింగ్స్‌లతో ముంబై విజయంపై ఆశలు రేకెత్తించనప్పటికీ.. ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ 4, రబాడ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు. అంతకుమందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ధావన్(70), మయాంక్ అగర్వాల్(52), జితేష్ కుమార్(30) పరుగులతో రాణించారు. మరి ముంబై పేరిట నమోదైన చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బేబీ ABD బ్రెవిస్ కోసం గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చిన రోహిత్ వర్మ
Words from our captain after #MIvPBKS.#OneFamily #DilKholKe #MumbaiIndians @ImRo45 pic.twitter.com/HLsInEAJLM
— Mumbai Indians (@mipaltan) April 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.