క్రికెట్ ప్రపంచంలోకి ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లే, చిరకాలం అందరకి గుర్తుంటారు. అలా ఐపీఎల్ 2022 సీజన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ‘ఉమ్రాన్ మాలిక్’. ‘జమ్మూ ఎక్సప్రెస్’ గా పేరు తెచ్చుకున్న ఈ యువ సంచాలనం వేగవంతమైన బంతులు సంధిస్తూ అబ్బురపరుస్తున్నాడు. గరిష్ఠంగా గంటకు 156 కిలోమీటర్ల వేగంతో వేస్తున్న బంతులకు క్రికెట్ ఫ్యాన్స్‌తోపాటు మాజీ క్రికెట్ దిగ్గజాలు సైతం వారెవా అంటున్నారు. అదరగొడుతున్నాడంటూ ఉమ్రాన్ మాలిక్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతిత్వరలోనే జాతీయ జట్టుకు ఆడడం ఖాయమని విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉండివుంటే ఈపాటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఉండేవాడేమోనని అన్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఎకానమీ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. క్రమం తప్పకుండా వికెట్లు తీయగలిగే సామర్థ్యం ఉన్న బౌలర్ అని కొనియాడాడు. ఆధునిక క్రికెట్‌లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీలకు సమానంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. ఆరోజుల్లో.. అక్తర్, బ్రెట్ లీ కూడా పరుగులిచ్చారు.. కానీ, నిలకడగా వికెట్లు తీశారని పేర్కొన్నాడు. నాణ్యత కలిగిన ఫాస్ట్ బౌలర్లను వెలికితీయడంలో మార్పులు తీసుకొచ్చిన ఇండియన్ క్రికెట్‌ను కూడా అతడు మెచ్చుకున్నాడు. ఇదివరకు భారత జట్టులో నాణ్యత కలిగిన ఫాస్ట్ బౌలర్ల కొరత ఉండేది. అయితే ఇప్పుడు మంచి బౌలర్లు ఉన్నారని పేర్కొన్నాడు.
Kamran Akmal on Umran Malik – “If Umran Malik was in Pakistan then Would have played international cricket”#TeamIndia #UmranMalik #kamranAkmal pic.twitter.com/OtfDPDMClO
— Cricket Addictor (@AddictorCricket) May 14, 2022
ఇది కూడా చదవండి: Ravi Shastri: స్పీడ్ వేయడం గొప్ప కాదు.. ఉమ్రాన్ మాలిక్‌పై రవిశాస్త్రి సెటైర్లు
ప్రస్తుతం నవదీప్ షైనీ, సిరాజ్, షమీ, బుమ్రా.. వంటి పేసర్ల ఉన్నారని గుర్తుచేశాడు. ఉమేష్ యాదవ్ కూడా చక్కటి వేగంతో బంతులు వేయగలడు. 10 నుంచి 12 మంది ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వీరి నుంచి నలుగురిని ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు కొంచెం కష్టమే అని అక్మల్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్..11 మ్యాచుల్లో 15 వికెట్లతో ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్-2 స్థానంలో కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్ శనివారం(మే 14) కోలకతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచులో తప్పక గెలవాలి. ఉమ్రాన్ మాలిక్ పాకిస్థాన్‌లో పుట్టాల్సింది అన్న కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
The young Indian pacer has caught the attention of the cricketing fraternity with his raw pace 🔥
🔗: https://t.co/sWA449HHh0#IPL2022 #Cricket #KKRvSRH @umran_malik_1 pic.twitter.com/bzWl9Quqrj
— Cricket.com (@weRcricket) May 14, 2022
Shoaib Akhter , Urman Malik , Mitchell Starc and Waqar Younis delivery released angle almost same . Also low loading arm may be key of pace .. @shoaib100mph @umran_malik_1 @mstarc56 @waqyounis99 pic.twitter.com/MrP7ovkAwu
— RASHID LATIF 🇵🇰 (@iRashidLatif68) May 8, 2022