ఐపీఎల్ 2022తో ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన కొత్త టీమ్.. గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మంగళవారం మరో కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (63పరుగులు 49బంతుల్లో 7ఫోర్లు నాటౌట్) కడదాకా నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రాహుల్ తెవాటియా(23పరుగులు 16బంతుల్లో 4ఫోర్లు నాటౌట్) రాణించడంతో గుజరాత్ 144 పరుగులు చేయగలిగింది.
లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ ఒక వికెట్, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు, జాసన్ హోల్డర్ 1 వికెట్ తీశారు. 145 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. దీపక్ హుడా (27 పరుగులు 26 బంతుల్లో) మినహా మిగతా బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. డికాక్ (11), ఆవేశ్ ఖాన్ (12) తప్పా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక గుజరాత్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ 3 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. యష్ దయాళ్ 2 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 3.5 ఓవర్లలో 4 వికెట్లు తీసి 24పరుగులు ఇచ్చాడు. తన గింగిరాలు తిప్పే బౌలింగ్‌తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో వైపు ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన బౌలర్ సాయి కిషోర్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
3 స్థానాల కోసం 8 జట్లు..
పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం 8 జట్లు.. (లక్నో, రాజస్థాన్, RCB, SRH, ఢిల్లీ, KKR, పంజాబ్, CSK) పోటీ పడుతున్నాయి. వీరిలో రాజస్థాన్, లక్నో, ఆర్సీబీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ.. మిగితా జట్లను తక్కువ అంచనా వేయలేం. ప్రస్తుతం ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. చాలా జట్లకు ఇప్పుడున్న మ్యాచ్‌లున్నీ డూ ఆర్ డై మ్యాచ్‌లే. మరి ఈ ఎనిమిది జట్లలో ఏ మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravi Shastri: ఆ ఆటగాడిని చూసి ఎలా ఆడాలో నేర్చుకో.. పంత్ కు రవిశాస్త్రి సలహా!
Congratulations to @gujarat_titans on becoming the first team to qualify for the #TATAIPL 2022 Playoffs. pic.twitter.com/grtnSSiflZ
— IndianPremierLeague (@IPL) May 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.