ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్ విఫలమైన వేళ.. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. జోష్ హజెల్ వుడ్, హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లలో చూడచక్కని షాట్లతో పరుగులు పిండుకున్న రియాన్ పరాగ్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. సిక్సర్ బాదిన ఆనందంలో ఏదో అన్న రియాన్ పరాగ్‌తో ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ వాగ్వాదానికి దిగాడు.
ఎందుకు అంత అత్యుత్సాహం అంటూ అతనిపైకి దూసుకెళ్లాడు. రియాన్ పరాగ్ సైతం ధీటుగా బదులివ్వడంతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. హర్షల్‌కు సిరాజ్ సైతం జత కాగా.. మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్ వారిని వారించాడు. అయితే అక్కడ ఏం జరిగిందనేదానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ.. సిక్సర్ కొట్టాడనే అసహనంతోనే హర్షల్ పటేల్ అతనితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. మొత్తానికి ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆటతోనే విమర్శకులకు బదులిచ్చాడని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. రియాన్ పరాగ్ తర్వాత సంజూ శాంసన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ చతికిల పడింది. 19.3 ఓవర్లలకు 115 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మరి హర్షల్ పటేల్-రియాన్ పరాగ్ ఘర్షణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ స్థానంపై కన్నేసిన హార్దిక్.. ఆ స్థానంలో బ్యాటింగ్ కు వస్తే చెలరేగుతా..!
Harshal vs riyan parag fight#RCBvsRR #parag #HarshalPatel #IPL20222 pic.twitter.com/Xotv4DGF8T
— John cage (@john18376) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.